తెలుగు న్యూస్ / ఫోటో /
రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. లాంచ్‌పై క్లారిటీ ఇచ్చిన సంస్థ!
- ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. 2 వీలర్ సెగ్మెంట్లో కూడా కొత్త కొత్త లాంచ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు వస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై తాజాగా స్పందించింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.

(1 / 5)
2025లో మార్కెట్లోకి సంస్థ నుంచి తొలి ఈవీ వస్తుందని రాయల్ ఎన్ఫీల్డ్ ఎండీ సిద్ధార్థ లాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం స్పెయిన్‌కు చెందిన స్టార్క్ ఫ్యూచర్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదిరినట్టు వివరించారు.(HT AUTO)
(2 / 5)
ప్రీమియం ఈవీ సెగ్మెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సంచలనం సృష్టిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. 134మిలియన్ డాలర్ల క్యాపెక్స్‌తో ఈవీలపై ఫోకస్ చేసింది సంస్థ.(HT AUTO)
(3 / 5)
ప్రస్తుతానికి.. సప్లై పార్ట్నర్స్ కోసం అన్వేషిస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్. టెస్ట్ మోడల్స్‌ను కూడా సిద్ధం చేస్తోంది.(HT AUTO)
(4 / 5)
ఈవీ తయారీలో ఇన్నోవేషన్‌కు పెద్ద పీట వేస్తున్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. ఇందుకోసం కొత్త టీమ్‌ను రిక్రూట్ చేసుకుంది.(HT AUTO)
ఇతర గ్యాలరీలు