తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2023 Hero Glamour : అప్డేటెడ్​ ఫీచర్స్​తో హీరో గ్లామర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

2023 Hero Glamour : అప్డేటెడ్​ ఫీచర్స్​తో హీరో గ్లామర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

25 August 2023, 8:50 IST

    • 2023 Hero Glamour launch : 2023 హీరో గ్లామర్​ లాంచ్​ అయ్యింది. సరికొత్త ఫీచర్స్​తో ఈ మోడల్​ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు..
2023 హీరో గ్లామర్​ లాంచ్​.. ధర ఎంతంటే!
2023 హీరో గ్లామర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

2023 హీరో గ్లామర్​ లాంచ్​.. ధర ఎంతంటే!

2023 Hero Glamour launch : 2023 హీరో గ్లామర్​ను తాజాగా లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​. రెండు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండనుంది. అవి డ్రమ్​, డిస్క్​. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

అప్డేటెడ్​ గ్లామర్​ ఎలా ఉంది..?

ఈ 2023 హీరో గ్లామర్​లో 125 సీసీ, సింగిల్​ సిలిండర్​, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 10.68 బీహెచ్​పీ పవర్​ను, 10.6 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఈ బైక్​కు హీరో ఐ3ఎస్​ ఐడిల్​ స్టాప్​- స్టార్ట్​ సిస్టెమ్​ లభిస్తోంది. ఈ20 ఫ్యూయెల్​పైనా ఇది నడుస్తుంది. ఈ మోడల్​.. 63కేఎంపీఎల్​ మైలేజ్​ ఇస్తుందని సంస్థ చెబుతోంది.

హీరో గ్లామర్​ అప్డేటెట్​ వర్షెన్​లో కొత్త డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వస్తోంది. ఇందులో రియల్​ టైమ్​ మైలేజ్​ ఇండికేటర్​, లో ఫ్యూయెల్​ ఇండికేటర్​ వంటివి కనిపిస్తాయి. వీటితో పాటు బైక్​కు యూఎస్​బీ ఛార్జర్​ సైతం లభిస్తోంది.

2023 Hero Glamour features : ఇక ఈ 2 వీలర్​ డైమెన్షన్స్​ కూడా స్వల్పంగా మారాయి. రైడర్​, పిలియన్​ సీట్​ల హైట్​ను 8ఎంఎం, 17ఎంఎం మేర తగ్గించింది హీరో మోటోకార్ప్​ సంస్థ.

"గ్లామర్​కు ప్రత్యేక ఫ్యాన్​బేస్​ ఉంది. యువతలో ఈ మోడల్​కు మంచి డిమాండ్​ ఉంది. స్టైల్​, కంఫర్ట్​ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్​గా నిలుస్తోంది. ఇక కొత్త గ్లామర్​ లాంచ్​తో.. 125సీసీ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నాము. కొత్త అవతారంలో వస్తున్న హీరో గ్లామర్​కు డిమాండ్​ లభిస్తుందని ఆశిస్తున్నాము. మా 2 వీలర్​ పోర్ట్​ఫోలియో మరింత బలపడింది," అని హీరో మోటోకార్ప్​ చీఫ్​ బిజినెస్​ ఆఫీసర్​ రంజీవ్​జిత్​ సింగ్​ తెలిపారు.

ఈ బైక్​ ధర ఎంతంటే..

Hero Glamour on road price Hyderabad : 2023 హీరో గ్లామర్​ డ్రమ్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 82,348గా ఉంది. ఇక డిస్క్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర రూ. 86,348గా ఉంది. క్యాండీ బ్లేజింగ్​ రెడ్​, టెక్నో బ్లూ-బ్లాక్​, స్పోర్ట్స్​ రెడ్​-బ్లాక్​ వంటి కొత్త రంగుల్లో ఈ మోడల్​ అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్​.. టీవీఎస్​ రైడర్​ 125, బజాజ్​ పల్సర్​ 125, హోండా షైన్​ వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

హీరో కరిష్మా.. సరికొత్త అవతారంలో..!

కరిష్మా మోడల్​తో హీరో మోటోకార్ప్​ సంస్థ గతంలో పెద్ద హిట్​ కొట్టింది. తక్కువ సమయంలోనే ఈ మోడల్​కు డిమాండ్​ భారీగా పెరిగింది. చాలా కాలం తర్వాత సేల్స్​లో డ్రాప్​ కనిపించడంతో, ఈ మోడల్​ను 2020లో డిస్కంటిన్యూ చేసింది హీరో సంస్థ. ఇక ఇప్పుడు ఈ బైక్​ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210 పేరుతో మార్కెట్​లో ఈ నెల 29న ఈ బైక్​ లాంచ్​ అవుతుందని సమచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం