తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Motocorp: హీరో మోటో కార్ప్ చైర్మన్ కు చెందిన రూ. 25 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

Hero MotoCorp: హీరో మోటో కార్ప్ చైర్మన్ కు చెందిన రూ. 25 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

HT Telugu Desk HT Telugu

03 August 2023, 11:42 IST

google News
  • ED seizes Hero MotoCorp chairman assets: హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ కాంత్ ముంజల్ కు చెందిన రూ. 25 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ముంజల్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది.

హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ కాంత్ ముంజల్
హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ కాంత్ ముంజల్

హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ కాంత్ ముంజల్

ED seizes Hero MotoCorp chairman assets: హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ కాంత్ ముంజల్ కు చెందిన రూ. 25 కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ముంజల్ తో పాటు అతడి సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది.

నగదు, ఆభరణాలు

ఢిల్లీ, గురుగ్రామ్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్ పవన్ కాంత్ ముంజల్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ మంగళవారం దాడులు చేసింది. ఈ సందర్భంగా అక్కడి నుంచి రూ. 25 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వాటిలో బంగారు ఆభరణాలు, విదేశీ బంగారం, వజ్రాలు, నగదు, విదేశీ కరెన్సీ.. మొదలైనవి ఉన్నాయి. వాటితో పాటు పలు కీలక డాక్యుమెంట్లను, మొబైల్స్, హార్డ్ డిస్క్స్ వంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే, స్వాధీనం చేసుకున్న ఆస్తులు, డాక్యుమెంట్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ వెల్లడించలేదు. తనిఖీల సందర్భంగా ఈడీకి పూర్తిగా సహకరించినట్లు, ఈడీ అధికారులు అడిగిన అన్ని వివరాలను అందించినట్లు హీరో మోటో కార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ తో పాటు హేమంత్ దాహియా, కేఆర్ రామన్, హీరో మోటో కార్ప్ లిమిటెడ్, హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్ లపై ఈ దాడులు చేసినట్లు ఈడీ వెల్లడించింది.

డీఆర్ఐ

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (DRI) నుంచి అందిన సమాచారంతో ఈడీ హీరో మోటో కార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ పై దాడులు నిర్వహించింది. భారీగా విదేశీ కరెన్సీ తో ఏర్ పోర్ట్ లో పట్టుబడిన ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా.. డీఆర్ఐ ఈడీకి ఈ సమాచారం అందించింది. పవన్ ముంజల్ పై పీఎంఎల్ఏ, కస్టమ్స్ యాక్ట్స్ ప్రకారం కేసు నమోదు చేశారు.

తదుపరి వ్యాసం