తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Passion Pro Discontinued: హీరో ప్యాషన్ ప్రొ బైక్స్ ఉత్పత్తి నిలిపివేత; ఆ స్థానంలో మరింత చవకైన బైక్

Hero Passion Pro discontinued: హీరో ప్యాషన్ ప్రొ బైక్స్ ఉత్పత్తి నిలిపివేత; ఆ స్థానంలో మరింత చవకైన బైక్

HT Telugu Desk HT Telugu

29 July 2023, 14:32 IST

google News
  • Hero Passion Pro discontinued: సగటు మధ్యతరగతికి అనువైన బైక్ గా విజయవంతమైన ‘ప్యాషన్ ప్రొ (Hero Passion Pro)’ టూ వీలర్ ఉత్పత్తిని హీరో మోటార్స్ సంస్థ నిలిపివేసింది. తమ టూ వీలర్ ప్రొడక్ట్ లైన్ నుంచి ఈ బైక్ ను తొలగించింది.

హీరో ప్యాషన్ ప్రొ బైక్
హీరో ప్యాషన్ ప్రొ బైక్

హీరో ప్యాషన్ ప్రొ బైక్

Hero Passion Pro discontinued: తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజీ ఇచ్చే స్టైలిష్ బైక్ గా హీరో ప్యాషన్ ప్రొ పేరు గాంచింది. కానీ, ఆ బైక్ ఇకపై కొనుగోలుదారులకు అందుబాటులో ఉండదు. హీరో ప్యాషన్ ప్రొ ఉత్పత్తిని నిలిపివేయాలని హీరో మోటార్స్ సంస్థ నిర్ణయించింది. తమ వెబ్ సైట్ నుంచి ఆ బైక్ ను సైలెంట్ గా తొలగించింది. హీరో పాషన్ ప్రొ బైక్ ఇక లభించదని డీలర్లు కూడా స్పష్టం చేస్తున్నారు.

Hero Passion Pro : ఈ బైక్స్ ఉంటాయి..

అయితే, హీరో ప్యాషన్ ప్రో తాత్కాలికంగా అందుబాటులో ఉండదా? లేక శాశ్వతంగానా? అనే విషయంలో క్లారిటీ లేదు. కాగా, హీరో బైక్స్ లో పాపులర్ అయిన ప్యాషన్ ఎక్స్ టెక్ (Passion XTEC), ప్యాషన్ ప్లస్ (Passion Plus) బైక్స్ కొనుగోలు దారులకు అందుబాటులోనే ఉంటాయి. హీరో ప్యాషన్ ప్రో ఎక్స్ షో రూమ్ ధర ఢిల్లీలో రూ. 85 వేలుగా ఉంది.ఇందులో 113.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. హీరో బైక్స్ రేంజ్ లో స్ప్లెండర్ (Splendor) తరువాత అత్యధికంగా అమ్ముడుపోయిన బైక్ ఈ హీరో ప్యాషన ప్రొ.

Passion XTEC, Passion Plus: ప్యాషన్ ఎక్స్ టెక్, ప్యాషన్ ప్లస్

ప్యాషన్ ప్రో కన్నా ప్యాషన్ ఎక్స్ టెక్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ప్యాషన్ ఎక్స్ టెక్ లో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ కటాఫ్ సెన్సర్.. మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో కూడా 113.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ బైక్ ధర ప్యాషన్ ప్రో కన్నా తక్కువ. ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 80 వేలుగా ఉంది. మరింత సింపుల్ వర్షన్ కావాలనుకుంటే హీరో ప్యాషన్ ప్లస్ అందుబాటులో ఉంది. ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 76,301మాత్రమే. ఇందులో 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం