తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Duvvada Divvela At Tirumala : తిరుమలలో దువ్వాడ, దివ్వెల జంట- పెళ్లి వార్తలు వైరల్

Duvvada Divvela At Tirumala : తిరుమలలో దువ్వాడ, దివ్వెల జంట- పెళ్లి వార్తలు వైరల్

07 October 2024, 20:56 IST

google News
    • Duvvada Divvela At Tirumala : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయం ముందు మీడియాకు ఫోజులిచ్చారు. తిరుమల వీరిద్దరూ వివాహం చేసుకున్నారని ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిని వీరిద్దరూ ఖండించారు.
 తిరుమలలో దువ్వాడ, దివ్వెల జంట- పెళ్లి వార్తలు వైరల్
తిరుమలలో దువ్వాడ, దివ్వెల జంట- పెళ్లి వార్తలు వైరల్

తిరుమలలో దువ్వాడ, దివ్వెల జంట- పెళ్లి వార్తలు వైరల్

తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దర్శించుకున్నారు. తిరుమల ఆలయం వద్ద వీరిద్దరూ కలిసి ఫొటోలు దిగారు. అయితే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వివాహం చేసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తిరుమలలో మాధురిని వివాహం చేసుకున్నానని వస్తున్న వార్తలను దువ్వాడ శ్రీనివాస్ ఖండించారు. తన విడాకుల కేసు కోర్టులో ఉందని, అలాగే మాధురికి తన భర్తతో వివాదాలు ఉన్నాయన్నారు. ఆ కేసు కూడా కోర్టులో ఉందన్నారు.

తమ కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వాత వివాహం చేసుకుంటామని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. అప్పటి వరకు తామిద్దరం కలిసే ఉంటామన్నారు. తిరుమలలో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తో ఫొటోలు దిగారు. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఫొటోలు దిగారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని దువ్వాడ, దివ్వెల ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచారు.

ఇద్దరం కలిసే జీవిస్తాం

దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి గతంలోనూ తిరుమలకు వచ్చానని, ఇవాళ కూడా దర్శనం కోసమే వచ్చినట్లు దువ్వెల మాధురి పేర్కొన్నారు. ఇద్దరి విడాకుల కేసులు కొలిక్కి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటామని మాధురి తేల్చి చెప్పారు. అప్పటి వరకూ ఇద్దరం కలిసే జీవిస్తామన్నారు. అయితే తాము వివాహం చేసుకున్నామని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మెుద్దన్నారు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల వార్తల్లో నిలిచారు. కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలతో ఆయన తన భార్య దువ్వాడ వాణికి దూరంగా... మరో ఇంట్లో ఉంటున్నారు. దివ్వెల మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా తాము వివాహం చేసుకుంటామని ఆయనే ప్రకటించారు. ఇవాళ మాధురితో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన... దర్శనం అనంతరం మీడియాకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తదుపరి వ్యాసం