తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Incharges Latest List : వైసీపీ ఇంఛార్జుల జాబితా విడుదల - లిస్ట్ లో కేశినేని, బొత్స ఝాన్సీ పేర్లు - తాజా లిస్ట్ ఇదే

YSRCP Incharges Latest List : వైసీపీ ఇంఛార్జుల జాబితా విడుదల - లిస్ట్ లో కేశినేని, బొత్స ఝాన్సీ పేర్లు - తాజా లిస్ట్ ఇదే

11 January 2024, 21:20 IST

google News
    • YSR Congress Party News: కొత్త ఇంఛార్జులకు సంబంధించి మరో జాబితాను విడుదల చేసింది వైసీపీ. ఈ లిస్ట్ లో పలు పార్లమెంట్ స్థానాలతో మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జులను నియమించింది.
వైసీపీ ఇంఛార్జుల లిస్ట్
వైసీపీ ఇంఛార్జుల లిస్ట్ (YSRCP Twitter)

వైసీపీ ఇంఛార్జుల లిస్ట్

YSRCP Third Incharges List : వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన ఫ్యాన్ పార్టీ… తాజాగా మరో జాబితాను ప్రకటించింది. ఇందులో పలు పార్లమెంట్ స్థానాలతో పాటు మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను సజ్జల, మంత్రి బొత్స వెల్లడించారు.

ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది వైసీపీ. తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానికి విజయవాడ బాధ్యతలను అప్పగించింది. ఇక మంత్రి బొత్స భార్య.. ఝాన్సీని విశాఖపట్నం పార్లమెంట్ ఇంఛార్జ్ గా నియమించింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న జయరామ్ పేరును కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జ్ గా ప్రకటించింది.

ఇక పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది వైసీపీ అధినాయకత్వం. ఈ నియోజకవర్గానికి జోగి రమేశ్ పేరును ప్రకటించింది. ఫలితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథికి చెక్ పెట్టేసినట్లు అయింది. ఆయన కూడా తెలుగుదేశంలోకి వెళ్లే అవకాశం ఉంది. పెడన నియోజకవర్గానికి ఉప్పాల రాము పేరును ప్రకటించింది. టెక్కలి నియోజకవర్గానికి దువ్వాడ శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది వైసీపీ.

పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జులు:

  1. విజయవాడ - కేశినేని నాని
  2. విశాఖపట్నం - బొత్త ఝాన్సీ
  3. కర్నూలు - గుమ్మనూరి జయరామ్
  4. తిరుపతి - కోనేటి ఆదిమూలం
  5. శ్రీకాకుళం - పేరాడ తిలక్
  6. ఏలూరు - సునీల్ కుమార్ యాదవ్

అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జులు:

  1. టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
  2. గూడురు - మురళి
  3. సత్యవేడు - గురుమూర్తి
  4. పెడన - ఉప్పాల రాము
  5. ఇఛ్చాపురం - పిరియ విజయ
  6. రాయదుర్గం - గోవిందరెడ్డి
  7. దర్శి - శివప్రసాద్ రెడ్డి
  8. చింతలపూడి - విజయరాజు
  9. పూతలపట్టు - సునీల్ కుమార్
  10. చిత్తూరు - విజయానందరెడ్డి
  11. పెనమలూరు - జోగి రమేశ్
  12. మదనపల్లె - నిస్సార్ అహ్మద్
  13. రాజంపేట - అమర్నాథ్ రెడ్డి
  14. ఆలూరు - విరూపాక్షి
  15. కోడుమూరు - డాక్టర్ సతీశ్

శ్రీకాకుళం జెడ్పీ ఛైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమించాలని నిర్ణయం. ప్రస్తుతం ఈమె ఇచ్ఛాపురం ఇంఛార్జ్ గా ఉన్నారు.

తదుపరి వ్యాసం