తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ntr Health University: రేపు Ysr పేరు మారిస్తే….? షర్మిల కీలక వ్యాఖ్యలు

NTR Health University: రేపు YSR పేరు మారిస్తే….? షర్మిల కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu

23 September 2022, 18:38 IST

google News
    • ntr university name change: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశంపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందిస్తూ... ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)
వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో) (twitter)

వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)

ys sharmila on ntr health university name change: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు... హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశం చుట్టే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఓవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా... నందమూరి కుటుంబం కూడా జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగానే... వైఎస్ జగన్ సోదరి షర్మిల స్పందించారు.

ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పుపై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానపరినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇవాళ పేరు మార్చి ఆ కోట్లాది మంది ఆరాధించే పెద్ద మనిషిని అవమానిస్తే ..రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని అవమానించినట్లే అవుతుందన్నారు. పాదయాత్రలో భాగంగానే షర్మిల ఇదే అంశంపై ఇంకొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపుతున్నాయి.

‘‘నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే గొప్ప నాయకులను అవమానపరిచినట్లే. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమానపరిచినట్లే. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు...రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే?’’ అని షర్మిల ప్రశ్నించారు.

ఒకరి ఖ్యాతిని తీసుకుని వైఎస్సార్ కి ఆ ఖ్యాతిని ఇవ్వాల్సిన అవసరం లేదని షర్మిల అన్నారు. వైఎస్సార్ చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారని చెప్పారు. వైఎస్ఆర్ కు ఉన్న ఖ్యాతి ప్రపంచంలో ఎవరి లేదన్నారు. అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్సార్ కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని స్పష్టం చేశారు.

ntr health university name change: మరోవైపు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం వారి నిర్ణయాన్ని బలంగా సమర్థించుకుంటోంది. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చిన వైఎస్ఆర్ పేరు పెట్టడమే సరైనదంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇదే అంశంపై చంద్రబాబు స్పందిస్తూ... తాము అధికారంలోకి వచ్చాక తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతామని స్పష్టం చేశారు. మొత్తంగా వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పై అధికార వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

తదుపరి వ్యాసం