HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Information : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌- పండుగ సీజన్ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లు, అదనపు స్టాపులు

Trains Information : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌- పండుగ సీజన్ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లు, అదనపు స్టాపులు

HT Telugu Desk HT Telugu

08 September 2024, 19:09 IST

    • Trains Information : వచ్చే పండుగల సీజన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. విశాఖ వీదుగా 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నాలుగు రైళ్లకు అదనపు స్టాపులు నిర్ణయించారు. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌- పండుగ సీజన్ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లు, అదనపు స్టాపులు
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌- పండుగ సీజన్ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లు, అదనపు స్టాపులు

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌- పండుగ సీజన్ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లు, అదనపు స్టాపులు

Trains Information : ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అలాగే దసరా, దీపావళి, ఛత్ పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీఎం కె. సందీప్ కోరారు.

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి హౌరా-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం-హౌరా వీక్లీ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రెండు రైళ్లను యశ్వంత్‌పూర్ స్టేషన్ వరకు పొడిగించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

ఉత్తర మధ్య రైల్వేలోని ధోల్‌పూర్, హేతాంపూర్ స్టేషన్‌ల మధ్య మెయిన్‌లైన్‌లో కట్, కనెక్షన్ పనిసమయంలో రెండు కోచింగ్ రైళ్ల మళ్లించారు. కొత్తవలస-కిరండూల్‌ లైన్‌లో భారీ వర్షాల సూచన కారణంగా రెండు నైట్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దారి మళ్లించారు.

శ్రీకాకుళం రోడ్, బ్రహ్మాపూర్ స్టేషన్లలో ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ – సంత్రగచ్చి - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్, తాంబరం – సంత్రగచ్చి - తాంబరం వీక్లీ స్పెషల్ రైళ్లకు అదనపు స్టాపేజ్ అందించాలని రైల్వే నిర్ణయించింది.

16 ప్రత్యేక రైళ్లు

1. కొచ్చువేలి - షాలిమార్ ప్రత్యేక రైలు (06081) సెప్టెంబ‌ర్ 20 నుంచి న‌వంబ‌ర్ 29 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

2. షాలిమార్ - కొచ్చువేలి ప్రత్యేక రైలు (06082) సెప్టెంబ‌ర్ 23 నుంచి డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

3. తిరునల్వేలి– షాలిమార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06087) రైలు సెప్టెంబ‌ర్ 12 నుంచి న‌వంబ‌ర్ 28 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

4. షాలిమార్ - తిరునెల్వేలి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06088) రైలు సెప్టెంబ‌ర్ 14 నుంచి న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

5. కోయంబత్తూరు - బరౌని స్పెషల్ (06059) రైలు సెప్టెంబ‌ర్ 10 నుంచి న‌వంబ‌ర్ 26 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

6. బరౌని-కోయంబత్తూరు స్పెషల్ (06060) రైలు సెప్టెంబ‌ర్ 13 నుంచి న‌వంబ‌ర్ 29 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

7. కోయంబత్తూరు - ధన్‌బాద్ జంక్షన్‌ ప్రత్యేక రైలు (06063) సెప్టెంబ‌ర్ 13 నుంచి న‌వంబ‌ర్ 29 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

8. ధన్‌బాద్ జంక్ష‌న్‌- కోయంబత్తూరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (06064) సెప్టెంబ‌ర్ 16 నుంచి డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

9. ఎర్నాకులం నుంచి పాట్నా అన్‌రిజర్వ్‌డ్ స‌మ్మర్ స్పెష‌ల్ రైలు (06085) సెప్టెంబ‌ర్ 13 నుంచి న‌వంబ‌ర్ 29 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

10. పాట్నా-ఎర్నాకులం అన్‌రిజర్వ్‌డ్ సమ్మర్ స్పెషల్ రైలు (06086) సెప్టెంబ‌ర్ 16 నుంచి డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

11. షాలిమార్ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (02841) రైలు సెప్టెంబ‌ర్ 30 నుంచి న‌వంబ‌ర్ 18 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

12. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ - షాలిమార్‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (02842) రైలు అక్టోబ‌ర్ 1 నుంచి న‌వంబ‌ర్ 20 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

13. సంత్రాగచ్చి - సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08845) రైలు అక్టోబ‌ర్ 4 నుంచి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

14. సికింద్రాబాద్-సంత్రగచిస్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08846) రైలు అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 16 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

15. మాల్దా టౌన్-సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (03430) అక్టోబ‌ర్ 8 నుంచి న‌వంబ‌ర్ 26 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.

16. సికింద్రాబాద్-మాల్దా టౌన్ వీక్లీ స్పెషల్ రైలు (03429) అక్టోబ‌ర్ 10 నుంచి న‌వంబ‌ర్ 28 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీఎం కె. సందీప్ కోరారు.

హౌరా నుంచి యశ్వంత‌పూర్ వ‌ర‌కు సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి హౌరా - శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం - హౌరా వీక్లీ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రెండు రైళ్లను యశ్వంత్‌పూర్ స్టేషన్ వరకు పొడిగించాలని రైల్వే నిర్ణయించింది.

1. హౌరా - శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం వీక్లీ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు (22831) సెప్టెంబ‌ర్ 25 నుంచి యశ్వంత్‌పూర్ వరకు పొడిగించారు. ఈ రైలు ఇక నుంచి యశ్వంతపూర్ వ‌ర‌కు వెళ్తుంది.

2. యశ్వంత్‌పూర్-శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా వీక్లీ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22832) సెప్టెంబ‌ర్ 27 నుంచి యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం చేరుకుని అక్కడ నుంచి హౌరా వెళ్తుంది. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీఎం కె. సందీప్ కోరారు.

నాలుగు రైళ్ల మళ్లింపు

ఉత్తర మధ్య రైల్వేలోని ధోల్‌పూర్, హేతాంపూర్ స్టేషన్‌ల మధ్య మెయిన్‌లైన్‌లో కట్, కనెక్షన్ పని సమయంలో కోచింగ్ రైళ్లను మళ్లించారు. కొత్తవలస-కిరండూల్‌ లైన్‌లో భారీ వర్షాల సూచన కారణంగా నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించారు.

1. విశాఖపట్నం-నిజాముద్దీన్ బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (12803) రైలు సెప్టెంబ‌ర్ 13న విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది.

2. విశాఖపట్నం-అమృత్‌సర్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ (20807) రైలు సెప్టెంబ‌ర్ 13న విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది.

3. విశాఖపట్నం-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ రైలు (18514) సెప్టెంబ‌ర్ 8 నుంచి సెప్టెంబ‌ర్ 11 వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరి, విజయనగరం, రాయగడ, కోరాపుట్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

4. కిరండూల్-విశాఖపట్నం రాత్రి ఎక్స్‌ప్రెస్ రైలు (18513) సెప్టెంబ‌ర్ 8 నుంచి సెప్టెంబ‌ర్ 11 వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరి, విజయనగరం, రాయగడ, కోరాపుట్ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. ప్రజలు ఈ మార్పులను గమనించాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీఎం కె. సందీప్ కోరారు.

నాలుగు రైళ్లకు శ్రీకాకుళం రోడ్, బ్రహ్మపూర్ వద్ద అదనపు స్టాప్‌లు

శ్రీకాకుళం రోడ్, బ్రహ్మాపూర్ స్టేషన్లలో ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ – సంత్రగచ్చి - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్, తాంబరం – సంత్రగచ్చి - తాంబరం వీక్లీ స్పెషల్ రైళ్లకు అదనపు స్టాపేజ్ అందించాలని రైల్వే నిర్ణయించింది.

1. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06089) రైలు సెప్టెంబ‌ర్ 11 నుంచి సెప్టెంబ‌ర్ 27 వరకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌, బ్రహ్మపూర్ స్టేషన్‌లో ఆగుతుంది.

2. సంత్రాగచ్చి నుంచి బయలుదేరే సంత్రాగచ్చి - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ( 06090) రైలు సెప్టెంబ‌ర్‌ 12 నుంచి సెప్టెంబ‌ర్ 28 వరకు బ్రహ్మపూర్‌, శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో ఆగుతుంది.

3. తాంబరం నుంచి బయలుదేరే తాంబరం - సంత్రాగచ్చి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06095) రైలు సెప్టెంబ‌ర్ 28 వ‌ర‌కు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌, బ్రహ్మపూర్ స్టేషన్‌లో ఆగుతుంది.

4. సంత్రాగచ్చి నుంచి బయలుదేరే సంత్రాగచ్చి - తాంబరం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (06096) రైలు సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు బ్రహ్మపూర్, శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో ఆగుతుంది. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వాల్తేర్ డివిజ‌న్ ఎస్‌డీఎం కె. సందీప్ కోరారు.

జ‌గ‌దీశ్వర‌రావు జర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్