Train classes types: రైలులో ఉండే వివిధ క్లాసుల మధ్య తేడా తెలీదా? 3ఏ నుంచి స్లీపర్ క్లాస్ దాకా తేడా తెల్సుకోండి-know what are indian railways different classes types ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Train Classes Types: రైలులో ఉండే వివిధ క్లాసుల మధ్య తేడా తెలీదా? 3ఏ నుంచి స్లీపర్ క్లాస్ దాకా తేడా తెల్సుకోండి

Train classes types: రైలులో ఉండే వివిధ క్లాసుల మధ్య తేడా తెలీదా? 3ఏ నుంచి స్లీపర్ క్లాస్ దాకా తేడా తెల్సుకోండి

Koutik Pranaya Sree HT Telugu
Sep 06, 2024 04:30 PM IST

Train classes types: రైలు టికెట్లు బుక్ చేసేటప్పుడు వివిధ రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. దాంతో ఏ తరగతిలో సీటు బుక్ చేసుకోవాలనే ఆలోచనలో సందేహ పడతారు. సాధారణంగా రైళ్లలో ఉండే వివిధ తరగతులు లేదా క్లాసులు, వాటి గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.

రైలులో వివిధ క్లాసుల వివరాలు
రైలులో వివిధ క్లాసుల వివరాలు

రైలులో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువే. చాలా మంది దూర ప్రయాణాల కోసం రైలునే ఉత్తమంగా పరిగణిస్తారు. రైలులో ప్రయాణించాలంటే అతి ముఖ్యమైనది ట్రెయిన్ టికెట్. రైలు టికెట్ బుక్ చేసినప్పుడల్లా, వివిధ రకాల ఆప్షన్లు, తరగతులు లేదా క్లాసుల రకాలు కనిపిస్తాయి. చాలా మందికి ఈ విషయంలో అనేక సందేహాలుంటాయి.

భారతీయ రైళ్లను అన్ని రకాల ప్రయాణికుల సామర్థ్యానికి అనుగుణంగా రూపొందించారు. వివిధ తరగతుల్లో సౌకర్యాలు కూడా వేర్వేరుగా కల్పిస్తున్నారు. రైలు టికెట్ బుక్ చేయడానికి ముందు, రైల్లో ఉండే వివిధ క్లాసుల గురించి తెలుసుకుంటే స్పష్టత వస్తుంది.

స్లీపర్ క్లాస్

స్లీపర్ క్లాస్ భారతీయ రైల్వేలో అత్యంత సాధారణంగా ఎక్కువ మంది ఎన్నుకునే నాన్-ఏసీ కోచ్. ఒక రైలులో పది లేదా అంతకంటే ఎక్కువ బోగీలు స్లీపర్ క్లాస్‌వి ఉంటాయి. ఒక్కో కోచ్ లో 72 సీట్లు బెర్తులు ఉంటాయి.

3ఏ-త్రీ టైర్ ఏసీ

3ఏ బోగీలోని సీట్లు స్లీపర్ క్లాస్ మాదిరిగానే ఉంటాయి. కానీ ఇందులో ఏసీ సౌకర్యం ఉంటుంది. ఒకే కంపార్ట్ మెంట్‌లో ఎనిమిది సీట్లు ఉంటాయి. ఒక బోగీలో 72 బెర్తులు ఉంటాయి.

2ఏ - టూ టైర్ ఏసీ

ఇండియన్ రైల్వేస్ టైర్-2 ఏసీ బోగీల్లో లెగ్ రూమ్, కర్టెన్లు, పర్సనల్ రీడింగ్ ల్యాంప్ ఉంటాయి.టైర్-2 ఏసీ బోగీల్లో ఒక వైపు నాలుగు సీట్లు, మరో పక్కన రెండు సీట్లు ఉంటాయి. అంటే కంపార్ట్ మెంటులో మొత్తం 6 సీట్లుంటాయి.కంపార్ట్‌మెంటుకు ప్రైవసీ కోసం కర్టెన్ ఉంటుంది.

1ఏ - వన్ టైర్ ఏసీ

వన్ టైర్ ఏసీ భారతీయ రైల్వేలో అత్యంత ఖరీదైన క్లాస్. 1ఎ కోచ్ టికెట్ ధర విమాన టిక్కెట్ ఛార్జీలతో సమానంగా ఉంటుంది. ఈ తరగతి ఉన్న కోచ్ లో ఎనిమిది క్యాబిన్లుంటాయి. ఒక్కో దాంట్లో 6 సీట్లుంటాయి. కంపార్ట్‌మెంటుకు కర్టెయిన్లుంటాయి. ఈ కోచ్ కు సహాయం చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారు. ఈ కోచ్ లోని స్లీపర్ బెర్తులు చాలా వెడల్పుగా ఉంటాయి. అలాగే, దీని సర్వీస్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

2S - సెకండ్ సీటింగ్

సెకండ్ సీటింగ్ నాన్ ఏసీ కోచ్ లు అతి తక్కువ తరగతి బోగీలు. ఇందులో ప్రయాణీకులకు సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ కోచ్ లో ముగ్గురు ప్రయాణికులు కూర్చునేలా బెర్త్ లేదా సీట్ ఉంటుంది.

ఇసి-ఎగ్జిక్యూటివ్ చైర్ కార్

ఇది కూడా ఎసి కోచ్ చైర్ కార్. అంటే బెర్తులుండవు. కేవలం కూర్చుని ప్రయాణించాలి. అయితే సీట్ల మధ్య ఖాళీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కో లైన్లో మొత్తం 4 సీట్లు ఉంటాయి. శతాబ్ది ఎక్స్ ప్రెస్ వంటి చైర్ కార్ రైళ్లలో ఈ బోగీలు ఉన్నాయి.

సిసి

సిసి లేదా చైర్ కార్ కోచ్ లు కూడా ఎసి సీటర్ కోచ్ లు. లైన్లో కేవలం ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి బోగీలు దగ్గరి ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటాయి.