తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rjy To Hyd Flights : రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లు

RJY to HYD Flights : రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లు

20 December 2024, 10:21 IST

google News
    • RJY to HYD Flights : రాజమండ్రి నుంచి విమానాల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా.. హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లను ప్రారంభించారు.
రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లు
రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లు

రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లు

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు ఎయిర్‌బస్‌ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయి నగరాలకు ఎయిర్‌బస్‌లు ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌కు మరో రెండు ఎయిర్‌బస్‌లను ప్రారంభించారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం కాకుండా.. రెండు రోజులు ముందుగానే హైదరాబాద్‌కు వీటిని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి నగరాలకు సంబంధించి మొత్తం 8 ఎయిర్‌బస్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి.

అయితే ఈ సర్వీసులను తాత్కాలికంగా నిర్వహించనున్నట్టు తెలిసింది. డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే హైదరాబాద్‌కు ఎయిర్‌బస్‌ సర్వీసుల రాకపోకలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌కు ఉదయం రాకపోకలు సాగించే రెండు ఏటీఆర్‌ విమాన సర్వీసులతో పాటు.. సాయంత్రం మరో రెండు ఏటీఆర్‌ విమాన సర్వీసుల స్థానంలో.. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు.

ఇటీవలే ఢిల్లీకి..

ఇటీవలే రాజమండ్రి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు ఢిల్లీకి, ముంబయికి వెళ్లాలంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్ లేదా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పడు రాజమండ్రి నుంచే ఢిల్లీ, ముంబయి విమాన సర్వీసులు మొదలయ్యాయి. రాజమండ్రి ఢిల్లీ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటీవల ప్రారంభించారు.

సమాయానికే విలువ..

ప్రస్తుతం ప్రజలు డబ్బు కంటే సమయానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందుకే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 158కి పెరిగింది. ఇంకా కొత్తవి నిర్మించేలా చర్యలు చేపడుతున్నారు.

తదుపరి వ్యాసం