LIVE UPDATES
Tirumala Darshan Tickets: తిరుమలలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ… నెలకు 3వేల టోకెన్ల విడుదల
Andhra Pradesh News Live December 2, 2024: Tirumala Darshan Tickets: తిరుమలలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ… నెలకు 3వేల టోకెన్ల విడుదల
02 December 2024, 11:16 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Darshan Tickets: తిరుమలలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ… నెలకు 3వేల టోకెన్ల విడుదల
- Tirumala Darshan Tickets: తిరుపతి, రేణిగుంట వాసుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. తొలి విడతగా డిసెంబర్ నెల కోటాను విడుదల చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: APRation Mafia: ఊరురా రేషన్ మాఫియా... రాజకీయమే అసలు శాపం.. జనం తినని బియ్యానికి వేల కోట్ల ఖర్చు..
- AP Ration Mafia: ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు అసలు కారణాలను అన్వేషించకుండా రాజకీయం సాగుతోంది. ఓట్ల వేటలో ఇబ్బడిముబ్బడిగా రేషన్ కార్డులు జారీ చేయడమే ఈ సమస్యకు మూల కారణం. జనం ఆహారంగా వినియోగించని దొడ్డు బియ్యంతో దళారులు కోట్లు కొల్లగొడుతున్నా ప్రభుత్వం కళ్లు ముసుకుంటోంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : ఫెంగల్ తుపాను ఎఫెక్ట్.. తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
- Tirumala : ఫెంగల్ తుపాను ఏపీ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాను అతలాకుతలం చేస్తోంది. అటు తిరుమల కొండపైనా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : ఆర్టీసీ గుడ్‌న్యూస్.. పంచ వైష్ణవ క్షేత్ర దర్శినికి ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవే
- APSRTC : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ మాసంలో 4 రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Rajahmundry to Mumbai Flight : నెరవేరిన 20 ఏళ్ల కల.. రాజమండ్రి నుంచి ముంబయి ఎయిర్‌బస్ విమాన సర్వీసు ప్రారంభం
- Rajahmundry to Mumbai Flight : రాజమండ్రి నుంచి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఇక్కడి నుంచి ముంబయికి ఎయిర్ బస్ స్టార్ట్ అయ్యింది. అటు రేణిగుంట- ముంబయి మధ్య కూడా డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం అయ్యింది. దీనిపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Kanaka Durga Temple : బెజవాడ దుర్గమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.100 కోట్లతో అభివృద్ధి.. 10 ముఖ్యాంశాలు
- Vijayawada Kanaka Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada : విజయవాడలో ఘోరం.. పదో తరగతి బాలికపై సవతి తండ్రి అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
- Vijayawada : విజయవాడలో ఘోరమైన ఘటన జరిగింది. పదో తరగతి బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేశాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీన్ని బాలిక తల్లి నిలదీసింది. అప్పటి నుంచి సవతి తండ్రి పరారీలో ఉన్నాడు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.