LIVE UPDATES
Avanti Srinivas Resignation: వైసీపీని వీడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ తీరుపై విమర్శలు
Andhra Pradesh News Live December 12, 2024: Avanti Srinivas Resignation: వైసీపీని వీడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ తీరుపై విమర్శలు
12 December 2024, 10:21 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Avanti Srinivas Resignation: వైసీపీని వీడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ తీరుపై విమర్శలు
- Avanti Srinivas Resignation: వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేవారు. వ్యక్తిగత కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వైసీపీ వ్యవహార శైలి నచ్చలేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఐదు నెలలు కూడా సమయం ఇవ్వకుండా విమర్శించడాన్ని తప్పు పట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Bapatla Crime: బాపట్ల జిల్లాలో దారుణం...తల్లి లేని బాలికపై సామూహిక అత్యాచారం
- Bapatla Crime: బాపట్ల జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తల్లి లేని బాలికపై ఒకరి తరువాత ఒకరు ఇద్దరు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరిపారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Capital Issue: అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
- AP Capital Issue: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో సాంకేతికంగా ఉన్న చిక్కుముడులను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోంది. అమరావతి చుట్టూ అల్లుకున్న వివాదాలను పరిష్కరించేలా చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Mangampet Murder: కుమార్తెపై లైంగిక వేధింపులు, ఫిర్యాదు పట్టించుకోని పోలీసులు, కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు…
- Mangampet Murder: తన కుమార్తెను తాత వరుసయ్యే వ్యక్తి లైంగికంగా వేధించాడని తల్లి పోలీసుల్ని ఆశ్రయించింది. నిందితుడిపై చర్యలు తీసుకోని పోలీసులు మందలించి పంపేశారు. పోలీసుల తీరుపై రగిలిపోయిన తండ్రి కువైట్ నుంచి వచ్చి నిందితుడ్ని హత్య చేసి తిరిగి వెళ్లిపోయాడు.తానే హత్య చేసినట్టు వీడియో విడుదల చేశాడు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Inter Caste Marriages: ఏపీలో కొత్త సమస్య.. ఆ కులాల్లో ఆడపిల్లల కొరత, కులాంతరమైనా ఫర్లేదంటున్న అబ్బాయిలు…
- Inter Caste Marriages: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందిన కొన్ని కులాలు తీవ్రమైన ఆడపిల్లల కొరత ఎదుర్కొంటున్నాయి. దీంతో సొంత కులంలో మగపిల్లలకు పెళ్లి కావడం కష్టమైపోతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే సమస్య నెలకొంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Liquor Prices: ఎట్టకేలకు ఏపీలో తగ్గిన మద్యం ధరలు.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు..
- AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు కథనానికి ఏపీ ఎక్సైజ్ శాఖ స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ధరలతో మద్యం విక్రయాలను జరపాలని ఆదేశించడంతో పాతబాటిళ్లపై కొత్త స్టిక్కర్లు ప్రత్యక్షం అయ్యాయి. మాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్ రూ.30 తగ్గింది.