తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు - టీటీడీ ప్రకటన

Tirumala : శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు - టీటీడీ ప్రకటన

16 December 2023, 9:08 IST

google News
    • Tirumala News:  రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ ను మార్చారు. ఈ మేరకు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది.
తిరుమల
తిరుమల

తిరుమల

Tirumala Latest News : రేణిగుంట విమానాశ్రయంలోని శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం) దర్శన టికెట్ కౌంటర్ మార్పునకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది టీటీడీ. దేశ విదేశాల నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే విమాన ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్ర‌తి రోజు 100 ఆఫ్‌లైన్‌ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో… విమానాశ్రయంలో శ్రీ‌వాణి టికెట్ల జారీకి అనుమ‌తి లేని కార‌ణంగా డిసెంబ‌రు 16వ తేదీ శ‌నివారం నుండి విమానాశ్రయంకు బ‌దులుగా తిరుమ‌ల గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్ర‌తి రోజు 100 టికెట్ల‌ను బోర్డింగ్ పాస్ స‌మ‌ర్పించిన భ‌క్తుల‌కు య‌ధావిధిగా శ్రీ‌వాణి ద‌ర్శ‌న ఆఫ్‌లైన్ టికెట్ల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతుంది. కావున భక్తులు విమానాశ్రయంలో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ కౌంటర్ మార్పును గమనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.

మరోవైపు శ్రీవారి భక్తులకు మరో అప్డేట్ ఇచ్చింది టీటీడీ. డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సంద‌ర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.

శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనాలు

Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటికే 2.25 లక్షల రూ. 300 దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారా భక్తులు పొందారు. డిసెంబరు 22 నుంచి ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకన్లు జారీ చేయనున్నారు. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా 4,23,500 టోకెన్లు మంజూరు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నామని టీటీడీ తెలిపింది.

తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణునివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ గోవిందరాజస్వామి రెండో సత్రం, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహం వద్ద సర్వదర్శనం టోకెన్‌ కౌంటర్లు ఏర్పాటుచేస్తారు.

తదుపరి వ్యాసం