Tirumala : డిసెంబ‌రులో తిరుమ‌ల‌లో జరిగే విశేష ఉత్స‌వాలు-special festivals in the month of december 2023 in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : డిసెంబ‌రులో తిరుమ‌ల‌లో జరిగే విశేష ఉత్స‌వాలు

Tirumala : డిసెంబ‌రులో తిరుమ‌ల‌లో జరిగే విశేష ఉత్స‌వాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 29, 2023 01:44 PM IST

TTD Latest News: డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది టీటీడీ. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది.

తిరుమల
తిరుమల

Special Festivals at Tirumala: డిసెంబర్ మాసంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది.డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌న ఉత్స‌వం ఉండగా… డిసెంబ‌రు 8న స‌ర్వ ఏకాద‌శి ఉంది.

డిసెంబ‌రులో తిరుమ‌ల‌లో విశేష ఉత్స‌వాలు:

– డిసెంబ‌రు 3న పార్వేట మండ‌పంలో కార్తీక వ‌న‌భోజ‌న ఉత్స‌వం.

– డిసెంబ‌రు 8న స‌ర్వ ఏకాద‌శి.

– డిసెంబ‌రు 12న అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం.

– డిసెంబ‌రు 17న ధ‌నుర్మాసం ప్రారంభం.

– డిసెంబ‌రు 22న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో చిన్న శాత్తుమొర‌.

– డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి. శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ప్రారంభం. స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం.

– డిసెంబ‌రు 24న వైకుంఠ ద్వాద‌శి నాడు శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం. శ్రీ స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటి.

– డిసెంబ‌రు 28న శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌ణ‌యక‌ల‌హ మ‌హోత్స‌వం.

అలా ఇవ్వడం అనవాయితీ - టీటీడీ ఛైర్మన్ భూమన

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో గల శేష వాహనం ముందు వివిఐపిలకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం ఇవ్వడం, వారిని అడిగి ఫొటోలు తీసుకోవడం జరుగుతూ ఉంది . అనంతరం వీటిని మీడియాకు, వివిఐపిలకు కూడా పంపడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ని కూడా కొందరు రాజకీయం చేసి విమర్శలకు దిగడం దౌర్భాగ్యమని ఆయన చెప్పారు.

ఈ సంప్రదాయంలో భాగంగానే సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో భారత ప్రధానమంత్రివర్యులు గౌ.శ్రీ నరేంద్ర మోడీ గారికి వేదపండితులు ఆశీర్వచనం చేశారన్నారు . తానే ప్రధానమంత్రి వర్యులను ఆహ్వానించి అక్కడ వారికి స్వామివారి ప్రసాదాలతో పాటు టీటీడీ కాఫీ టేబుల్ బుక్, పంచగవ్య ఉత్పత్తులు, 2024 డైరీ, క్యాలెండర్, స్వామివారి చిత్రపటం అందించడం జరిగిందని వివరించారు. ఆశీర్వచనం తరువాత తానే గౌ.ప్రధానమంత్రివర్యులను ఆహ్వానించి ఫొటోలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

అయితే కొంతమంది స్వామివారి శేష వాహనం ముందు ఇలా చేయడం సరి కాదని ప్రచారం చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే వివిఐపీలకు రంగనాయకుల మండపంలోని శేష వాహనం ఎదుట స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం తదితరాలు ఇవ్వడం, వారిని అడిగి ఫొటోలు తీసుకోవడం జరుగుతోందన్నారు . వీటినే మీడియాకు పంపడమనేది ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. స్వామి వారి దర్శనం తరువాత వివి ఐపిలు , విఐపిలు రంగనాయకుల మండపంలోని శేష వాహనం ముందే ఫోటోలు తీసుకునే ప్రదేశం. అయితే కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని కూడా వివాదాస్పదం చేయాలనుకోవడం దౌర్భాగ్యమన్నారు . దేవుడి దర్శనాన్ని కూడా రాజకీయం చేసి విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దుర్మార్గపు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ఛైర్మన్ కోరారు.

Whats_app_banner