తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rbi Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, నెలకు రూ.20 వేల స్టైఫండ్- ఇలా అప్లై చేసుకోండి

RBI Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, నెలకు రూ.20 వేల స్టైఫండ్- ఇలా అప్లై చేసుకోండి

16 October 2024, 9:41 IST

google News
  • RBI Internship 2024 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్ షిప్-2024 ప్రోగ్రామ్ కు దరఖాస్తులు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 125 మంది విద్యార్థులకు మూడు నెలల పాటు ఆర్బీఐ శిక్షణ ఇస్తుంది. అక్టోబర్ 15 దరఖాస్తులు ప్రారంభం కాగా...డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.

ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, నెలకు రూ.20 వేల స్టైఫండ్- ఇలా అప్లై చేసుకోండి
ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, నెలకు రూ.20 వేల స్టైఫండ్- ఇలా అప్లై చేసుకోండి

ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, నెలకు రూ.20 వేల స్టైఫండ్- ఇలా అప్లై చేసుకోండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సమ్మర్ ఇంటర్న్‌షిప్-2024 ప్రోగ్రామ్ కు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్బీఐ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ rbi.org.in లోని లింక్‌ ను చూడవచ్చు. దరఖాస్తులకు డిసెంబర్ 15, 2024 చివరి తేదీ. ఏప్రిల్ నుంచి జులై వరకు మూడు నెలల పాటు ఆర్బీఐ ఇంటర్న్ షిప్ ప్రోగామ్ పై శిక్షణ ఇస్తారు. నెలకు రూ.20,000 స్టైఫండ్ ఇస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా తమ కళాశాల/ఇనిస్టిట్యూట్ ఉన్న రాష్ట్రాన్ని దరఖాస్తులో సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది.

ఆర్బీ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2024- అర్హతలు

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న అభ్యర్థులు
  • మేనేజ్‌మెంట్ / స్టాటిస్టిక్స్ / లా / కామర్స్ / ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్ / బ్యాంకింగ్ / ఫైనాన్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు
  • ప్రముఖ సంస్థలు / కళాశాలల నుంచి న్యాయశాస్త్రంలో మూడు ఏళ్ల ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న వారు.
  • ప్రస్తుతం వారి కోర్సు చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ దరఖాస్తు విధానం

Step 1 : ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://opportunities.rbi.org.in/Scripts/index.aspx ను సందర్శించండి.

Step 2 : హోమ్ పేజీలోని 'సమ్మర్ ప్లేస్మెంట్స్' లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3 : ఆర్బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2024 పేజీలోని ఆన్ లైన్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి.

Step 4 : తదుపరి పేజీలో అభ్యర్థి పూర్తి వివరాలు నింపాలి. అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయండి.

Step 5 : ఆ తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోండి.

ఆర్బీఐ ప్రతి సంవత్సరం సమ్మర్ ప్లేస్‌మెంట్ కోసం 125 మంది విద్యార్థులను ఎంపిక చేస్తుంది. వచ్చే సంవత్సరం జనవరి/ఫిబ్రవరిలో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆయా రాష్ట్రాల్లోని ఆర్బీఐ కార్యాలయాలలో ఇంటర్వ్యూ చేస్తారు. ఎంపికైన విద్యార్థుల పేర్లు ఫిబ్రవరి/మార్చిలో ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ లో శిక్షణ ఇస్తారు. అలాగే ఈ మూడు నెలల పాటు నెలకు రూ.20 వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు.

పీఎం ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్

ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది యువతకు..ఏడాదికి రూ. 60,000 ఆర్థిక సహాయం అందించే ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. 2024-25లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.800 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2024లో ప్రకటించిన విధంగా టాప్ కంపెనీలలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఇంటర్న్‌లకు బీమా కవరేజీని కూడా అందిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేయనుంది.

ఇంటర్న్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్ pminternship.mca.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 12 నుంచి 25 వరకు అభ్యర్థులు ఈ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులను అక్టోబర్ 26 న షార్ట్‌లిస్ట్ చేస్తారు.

అర్హులు

ఆన్‌లైన్ / దూరవిద్య ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న అభ్యర్థులు, హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూళ్లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా కలిగిన వారు లేదా బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మా డిగ్రీలు కలిగి ఉన్నవారు అర్హులు.

తదుపరి వ్యాసం