Paid Internship | టాప్‌ స్టార్టప్ కంపెనీల్లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ కావాలా?-how to get paid internships in top startup companies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Paid Internship | టాప్‌ స్టార్టప్ కంపెనీల్లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ కావాలా?

Paid Internship | టాప్‌ స్టార్టప్ కంపెనీల్లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ కావాలా?

Internship | టాప్‌ స్టార్టప్ కంపెనీల్లో స్టైపండ్‌ సహా ఇంటర్న్‌షిప్‌ ఇచ్చే అవకాశం కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకొక మంచి రీసోర్స్‌గా ఉపయోగపడుతుంది.

ప్రతీకాత్మక చిత్రం: కెరీర్‌పై ఆశలు నింపే ఇంటర్న్‌షిప్ (unsplash)

Paid Internship | రేజర్‌పే, జూపీ, ఎంఎక్స్‌ ప్లేయర్, 1ఎంజీ, ఎంపీఎల్, ఎక్స్‌పీడీయా, పెప్పర్‌కంటెంట్, జూపిటర్, ప్లాజా, ట్రీబో వంటి స్టార్టప్స్‌లలో ఇంటర్న్‌షిప్‌ ఇచ్చేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది.

అప్‌రైజ్‌డ్‌ పోర్టల్‌ అందిస్తున్న ఎంబార్క్‌ ప్రోగ్రామ్‌ ఆయా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అందించేలా చేస్తుంది. ఇందుకు ముందుగా ఈశాట్‌(ఈఎస్‌ఏటీ) పరీక్ష ఒకటి, రెండు, మూడు రౌండ్లు పాసవ్వాలి. ఇందులో పాసైన అభ్యర్థులకు ఆరు వారాలు ట్రైనింగ్‌ ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌లో సక్సెస్‌ అయ్యేలా ఈ శిక్షణలో తీర్చిదిద్దుతారు.

ఇంటర్న్‌షిప్‌ వల్ల ప్రయోజనం ఏంటి?

నెలకు రూ. 15 వేల నుంచి రూ. 70 వేల వరకు స్టైపండ్‌ కూడా ఆయా కంపెనీలు ఇస్తాయి.  అంతేకాకుండా భవిష్యత్తులో ఆయా కంపెనీలు ఫుల్‌ టైమ్‌ జాబ్‌ కూడా ఆఫర్‌ చేసే అవకాశం దక్కుతుంది. అత్యుత్తమ అభ్యర్థులందరూ ఉండే ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌లో సభ్యులుగా ఉంటారు. ఇండస్ట్రీ లీడర్స్‌ నుంచి మెంటార్‌షిప్‌ లభిస్తుంది.

ఎవరెవరికి ఇది పనికొస్తుంది?

ఎంబార్క్‌ ప్రోగ్రామ్‌ ఇంజినీరింగ్, సైన్స్, ఎంబీఏ, ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్, డిజైన్‌ విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ప్రొడక్ట్‌ అండ్‌ గ్రోత్, డిజైన్, పీపుల్‌ ఆపరేషన్స్, బిజినెస్‌ ఆపరేషన్స్, అనలిటిక్స్‌ వంటి అంశాల్లో కెరీర్‌ డెవలప్‌మెంట్‌కు దోహదపడుతుంది. 

కేవలం ఎంబార్క్ ప్రోగ్రామ్ మాత్రమే కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్ ద్వారా పెయిడ్ ఇంటర్న్‌షిప్ అందించే సంస్థలు అనేకం ఉన్నాయి. వీటిని సద్వినియోగపరుచుకుంటే భవిష్యత్తులో మంచి కెరీర్ ఉంటుంది. 

 

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.