HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Private Travel Bus Accident : ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి, 10 మందికి గాయాలు

Private Travel Bus Accident : ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి, 10 మందికి గాయాలు

HT Telugu Desk HT Telugu

16 June 2024, 18:20 IST

    • Private Travel Bus Accident : ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతి చెందగా, 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి, 10 మందికి గాయాలు
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి, 10 మందికి గాయాలు

ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి, 10 మందికి గాయాలు

Private Travel Bus Accident : రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్‌ బ‌స్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బ‌స్సు క్లీన‌ర్ మృతి చెందారు. మ‌రో ప‌ది మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోని ప‌ల్నాడు జిల్లా సత్తెన‌ప‌ల్లి మండ‌లం కండిపూడి స‌మీపంలో జ‌రిగింది. ఈ ప్రమాదంలో న‌ర‌స‌రావుపేట మండ‌లం కాకాని గ్రామానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు క్లీన‌ర్ త‌మ్మిశెట్టి మ‌ణికంఠ (24) అక్కడిక‌క్కడే మృతి చెందాడు.

ట్రెండింగ్ వార్తలు

Visakha Crime : విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది- కత్తితో దాడి, యువతి తల్లికి తీవ్రగాయాలు

YS Sharmila On CM CBN : చంద్రబాబు గారు.... ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు, చక్కర్లు ఎందుకు కొడుతున్నారు..? వైఎస్ షర్మిల

APSRTC Arunachalam : మూడు జిల్లాల నుంచి అరుణాచ‌లం గిరి ప్రద‌క్షిణ‌కు స్పెష‌ల్ స‌ర్వీసులు, ఏపీపీఎస్ఆర్టీసీ ప్యాకేజీలివే

West Godavari News : ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో అమానుష ఘటన, మద్యం మత్తులో గేదేపై అత్యాచారం-కలెక్టర్ ఆదేశాలతో కేసు నమోదు

బాప‌ట్ల నుంచి ప్రయాణికుల‌తో హైద‌రాబాద్‌కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సు స‌త్తెనప‌ల్లి మండ‌లం కంటిపూడి స‌మీపంలో ఎదురుగా వ‌స్తున్న వాహనాన్ని త‌ప్పించే క్రమంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బ‌స్సు క్లీన‌ర్ మ‌ర‌ణించ‌గా, ప‌ది మంది ప్రయాణికుల‌కు గాయాల‌య్యాయి. వీరిలో బాప‌ట్ల రైలుపేట‌కు చెందిన కారంకి చంద్రశేఖ‌ర్, ఆయ‌న భార్య ల‌క్ష్మిల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. క్షత‌గాత్రుల‌ను సత్తెనప‌ల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాల‌కు త‌ర‌లించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స‌త్తెన‌ప‌ల్లి వైద్యశాల‌కు త‌ర‌లించారు. స‌త్తెన‌ప‌ల్లి రూర‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ ప‌రార‌య్యారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

పాత బాకీ అడిగినందుకు హ‌త్య

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెం మండ‌లం ప‌డాల‌లో పాత బాకీ అడ‌గినందుకు హత్య జ‌రిగింది. త‌నకు ఇవ్వాల్సిన డ‌బ్బుల‌ను అడిగినందుకు రాము అనే వ్యక్తిపై బాబీ క‌త్తితో దాడి చేసి హ‌త్య చేశాడు. కొన్నెళ్లు క్రితం బాబీ అనే వ్యక్తికి రాము డ‌బ్బులు ఇచ్చారు. ఆ డ‌బ్బుల‌ను రాము అడిగాడు. గ‌తంలో కూడా కొన్నిసార్లు అడిగాడు. అయితే బాబీ డ‌బ్బులు ఇవ్వటం లేదు. దీంతో రాము త‌న పాత బాకీల వ‌సూలు చేసే స‌మ‌యంలో రాము, లింగంప‌ల్లి బాబీ ఇద్దరి మ‌ధ్య ఘ‌ర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాముపై బాబీ కత్తితో దాడి చేశారు. అడ్డువెళ్లిన రాము బంధువులు కొత్త శ్రీ‌ను, కొత్త స‌ర‌స్వతిలపైన బాబీ దాడి చేశారు. క‌త్తిపోట్లకు గురైన రాము అక్కడిక‌క్కడే మృతి చెందారు. కొత్త శ్రీ‌ను, స‌ర‌స్వతిల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వీరిని తాడేప‌ల్లిగూడెం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మ‌ద్యం మ‌త్తులో యువ‌కుడి గొంతు కోసి

తిరుప‌తిలోని అలిపిరి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఆటోన‌గ‌ర్‌లోని దారుణ హ‌త్య జ‌రిగింది. మ‌ద్యం మ‌త్తులో యువ‌కుడి గొంతు కోసి దారుణంగా హ‌త్య చేశారు. ఆటోన‌గ‌ర్‌లోని ఓ ఆయిల్ షాపు వ‌ద్ద ఇద్దరు యువ‌కులు మ‌ద్యం సేవించారు. మ‌ద్యం మ‌త్తులో రాత్రి రెండు గంట‌ల వ‌ర‌కు ఇరువురు గొడ‌వ‌ప‌డ్డారు. ముంగిలి ప‌ట్టుకు చెందిన మాదం ప్రసాద్‌ను మ‌రొక యువ‌కుడు గొంతుకోసి దారుణంగా హ‌త్య చేశాడు. చుట్టుపక్కల వాళ్లు గ‌మ‌నించి కేక‌లు వేయ‌డంతో హంత‌కుడు ప‌రార‌య్యాడు. యువ‌కుడు అక్కడిక‌క్కడే మృతి చెందాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థలానికి చేరుకొని, హ‌త్య జ‌రిగిన తీరును ప‌రిశీలించారు. మృతదేహాన్ని తిరుప‌తి రూయా మార్చురీకి త‌ర‌లించారు. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేప‌ట్టారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం