తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Kgbv Recruitment 2024 : కేజీబీవీల్లో 604 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ - దరఖాస్తులకు అక్టోబ‌ర్ 10 ఆఖ‌రు తేదీ

AP KGBV Recruitment 2024 : కేజీబీవీల్లో 604 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ - దరఖాస్తులకు అక్టోబ‌ర్ 10 ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu

25 September 2024, 17:11 IST

google News
    • ఏపీ క‌స్తూర్బా గాంధీ బాలిక విద్యాల‌యాల్లో  ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ జారీ అయింది. మొత్తం 604 ఖాళీలను భర్తీ చేస్తారు. ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబ‌ర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
ఏపీ క‌స్తూర్బా గాంధీ బాలిక విద్యాల‌యాల్లో ఉద్యోగాలు
ఏపీ క‌స్తూర్బా గాంధీ బాలిక విద్యాల‌యాల్లో ఉద్యోగాలు

ఏపీ క‌స్తూర్బా గాంధీ బాలిక విద్యాల‌యాల్లో ఉద్యోగాలు

AP KGBV Recruitment 2024: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌స్తూర్బా గాంధీ బాలిక విద్యాల‌యాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌గ్ర శిక్ష సొసైటీ విడుద‌ల చేసింది. కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో బోధ‌న సిబ్బంది పోస్టుల‌, అవుట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో బోధ‌నేత‌ర సిబ్బంది పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. అర్హ‌త‌, ఆసక్తి క‌లిగిన మ‌హిళ అభ్య‌ర్థులు నుంచి ద‌రఖాస్తులు కోరుతూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్ అధికారికంగా విడుదల చేశారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అక్టోబ‌ర్ 10 ఆఖ‌రు తేదీ.

ఏయే పోస్టులు..?

ప్రిన్సిప‌ల్‌, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ, పార్ట్ టైం టీచర్స్‌, వార్డెన్‌, అకౌంటెంట్ వంటి పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. మొత్తం 604 పోస్టుల‌ను భర్తీ చేస్తారు. వాటిలో ప్రిన్సిప‌ల్ 10, పీజీటీ 165, సీఆర్‌టీ 163, పీఈటీ 4, పార్ట్ టైం టీచ‌ర్స్ 165, వార్డెన్ 53, అకౌంటెంట్ 43 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌ను 2024-25 విద్యా సంవ‌త్స‌రం (ఒక సంవ‌త్స‌రం) కాలానికి భ‌ర్తీ చేస్తున్నారు. మెరిట్ ఆధారంగానే ఎంపిక ఉంటుంది.

అర్హ‌త‌, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు అప్లై చేయాలంటే, క‌నీస వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు. అలాగే వ‌యో ప‌రిమితి 42 సంవ‌త్స‌రాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. మాజీ సైనిక ఉద్యోగుల‌కు మూడేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. దివ్యాంగులైన అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సులో ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంటుంది.

అర్హ‌త గల అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌బ‌డ‌వు. అధికారిక వెబ్‌సైట్ https://apkgbv.apcfss.in/ ద్వారా రూ. 250 ఫీజు చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబ‌ర్ 26న ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేయ‌డం ప్రారంభం అవుతుంది. అక్టోబ‌ర్ 10 రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు గ‌డువు ఉంటుంది. జిల్లాల వారీగా, పోస్టులు వారీగా, రోస్ట‌ర్ వారీగా పోస్టుల వివ‌రాలు అధికారిక వెబ్‌సైట్‌లో పెడ‌తారు.

ప్రిన్సిపాల్‌కు రూ.34,139, సీఆర్‌టీ (కాంట్రాక్ట్ రెసిడెన్సియ‌ల్ టీచ‌ర్‌)కు రూ.26,759, పీఈటీ (ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌)కు రూ.26,759, పీజీటీ (పోస్టు గ్రాడ్యూట్ టీచ‌ర్‌)కు రూ.26,759 ఉంటుంది. అలాగే ప్రిన్సిపాల్ పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసే అభ్య‌ర్థులు పీజీ చేసి ఉండాలి. పీజీలో ఓసీల‌కు 50 శాతం, బీసీల‌కు 45 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీల‌కు 40 శాతం మార్కులు రావాలి.

పీజీటీ పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసే అభ్య‌ర్థులు త‌ప్ప‌ని స‌రిగా రెండేళ్ల పీజీ చేయాలి. పీజీలో ఓసీల‌కు 50 శాతం, బీసీల‌కు 45 శాతం, ఎస్‌సీ, ఎస్‌టీల‌కు 40 శాతం మార్కులు రావాలి. సీఆర్‌టీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేయాలి. అలాగే 50 శాతం మార్కులు రావాలి. పీఈటీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త సాధించిడంతో పాటు ఫిజిక‌ల్ ఎడ్యూకేష‌న్‌లో బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులు పీఈటీ పోస్టుల‌కు అర్హులు కారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం