TS Gurukulam PGT Jobs: 1276 పీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్య తేదీలివే‌-telangana gurukulam pgt notification 2023 released check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Gurukulam Pgt Jobs: 1276 పీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్య తేదీలివే‌

TS Gurukulam PGT Jobs: 1276 పీజీటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్య తేదీలివే‌

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 02:06 PM IST

Telangana Gurukulam Job Updates 2023: పీజీటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసింది గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు. ఈ మేరకు ఖాళీలు, అర్హతలు, దరఖాస్తుల తేదీలను పేర్కొంది.

పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌
పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌

Telangana Gurukulam PGT Notification 2023: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9,231 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఓటీఆర్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా శుక్రవారం పీజీటీ ఉద్యోగాలకు సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ విడుదలైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టుల భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. సమగ్ర నోటిఫికేషన్ లో రాతపరీక్ష విధానాన్ని కూడా ప్రకటించింది గురుకులం బోర్డు. మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-1లో జనరల్‌స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంపై 100 మార్కులు ఉంటాయి. ఇక పేపర్‌-2లో బోధన పద్ధతులపై 100మార్కులు కేటాయించారు. పేపర్‌-3లో సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. అర్హత వయసు 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు.

జనరల్ అభ్యర్థులు 1200 ఫీజు చెల్లించాల్సి ఉంటుది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 దరఖాస్తు రుసం చెల్లించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. www.treirb.telangana.gov.in లింక్ తో ఓటీఆర్ తో పాటు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

TSPSC తరహాలోనే...

టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ఓటీఆర్ విజయవంతమైంది. ఒక్కసారి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఓటీఆర్ ఎంట్రీ చేస్తే సులభంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటో, సంతకం, విద్యార్హతలు వంటివి వివరాలను ప్రతిసారి నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా దరఖాస్తు ప్రక్రియ సింపుల్ గా పూర్తి అవుతుంది. ఈ తరహాలోనే గురుకులాల ఉద్యోగాల భర్తీలోనూ ఓటీఆర్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఎన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్నా.. వ్యక్తిగత వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.

గురుకులాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు :

జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ - 2008

డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ - 868

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) -1276

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4090

లైబ్రేరియ‌న్ స్కూల్- 434

పీజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ - 275

డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ -134

క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్- 92

మ్యూజిక్ టీచ‌ర్స్- 124

https://treirb.telangana.gov.in / వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత… భారీ సంఖ్యలో గురుకులాలను పెంచింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మూడేళ్ల క్రిత‌మే ఆయా గురుకులాల్లో 10 వేల పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరో 3వేల పోస్టులను కూడా భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. త్వరలోనే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం