తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore News : నెల్లూరులో తీవ్ర విషాదం, కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన బాలుడు మృతి!

Nellore News : నెల్లూరులో తీవ్ర విషాదం, కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన బాలుడు మృతి!

10 April 2024, 17:46 IST

google News
    • Nellore News : నెల్లూరు నగరంలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్ల బాలుడు కూల్ డ్రింగ్ అనుకుని పెట్రోల్ తాగేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొంతుదూ బాలుడు మృతి చెందాడు.
కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన బాలుడు
కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన బాలుడు (Pixabay)

కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన బాలుడు

Nellore News : ఏపీలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల బాలుడు కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్(Boy Drinks Petrol) తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు విగతజీవిగా పడిఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

అసలేం జరిగింది?

నెల్లూరు(Nellore) నగరంలోని ఇరుగాళమ్మ కట్టకు చెందిన షేక్ కరిముల్లా, అమ్ము భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. షేక్ కరిముల్లా స్థానికంగా చికెన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అమ్ములు చేపల దుకాణంలో పనిచేస్తుంది. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తుండగా అనుకోని ఘటన వీరి కుటుంబాన్ని విషాదంలో ముంచింది. ఈ నెల 7న అమ్ము ఇరుగాళమ్మ ఆలయం వద్ద పనిచేస్తుండగా...రెండేళ్ల కాలేషా అక్కడే ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ అక్కడ ఒక బాటిల్ లో ఉన్న పెట్రోల్(Petrol) చూసిన కాలేషా కూల్ డ్రింక్(Cool Drink) అనుకుని తాగేశాడు. అనంతరం బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయితే కాస్త ఆలస్యంగా బాలుడ్ని గమనించిన తల్లి..చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు కాలేషా మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదుతో చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది.

నిజామాబాద్ జిల్లాలో విషాదం

తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఆరేళ్ల బాలుడు మృతి(Boy Died) చెందాడు. నిజామాబాద్(Nizamabad) జిల్లా బోధన్ గోసం బస్తీకి చెందిన రేణుక అనే మహిళ తన కుమారుడు రాఘవతో కలిసి స్థానికంగా హనుమాన్ ఆలయం ప్రాంగణంలో కూలి పనులకు వెళ్లింది. తల్లి పనుల్లో ఉండగా కుమారుడు రాఘవ ఆడుకుంటూ వెళ్లికి ఓ కారులో(Car) చిక్కుకున్నాడు. బాలుడు కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజులుగా బాలుడు కనిపించకపోయే సరికి పోలీసులు...చివరిగా కనిపించిన స్థలం వద్దకు చేరుకుని విచారణ చేశారు. ఓ కారులో బాలుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. కారు డోర్లు ఓపెన్ అయి ఉన్నప్పుడు బాలుడు అందులోకి వెళ్లి ఉంటాడని, ఆ తర్వాత ప్రమాదవశాత్తు లాక్ అయి ఉంటాయని పోలీసులు గుర్తించారు. కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కారు ఓనర్ బయటకు వెళ్లేందుకు కారు తీస్తుండగా అందులో బాలుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు తెలిపాడు. తమ బిడ్డకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయని రాఘవ తల్లిదండ్రులకు విషాదంలో మునిగిపోయారు.

తదుపరి వ్యాసం