Rangareddy Family Suicide : రాజేంద్రనగర్ లో విషాదం, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య!
Rangareddy Family Suicide : రాజేంద్రనగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్ల బాలుడిని చంపి భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు.
Rangareddy Family Suicide : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (Rajendranagar)లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య(Family Sucidie) చేసుకుంది. సన్ సిటీ లో ఉంటున్న కుటుంబం దారుణానికి పాల్పడింది. ఐదేళ్ల బాలుడిని చంపి భార్యాభర్తలు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆనంద్, ఇంద్ర, శ్రహాన్షుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య
పని చేయకుండా జులాయిగా తిరుగుతున్న కొడుకుని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా (Sangareddy)గుమ్మడిదలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుమ్మడిదలకు చెందిన పిట్ల బాలేష్ చిన్న కుమారుడు నవీన్(24) గత కొన్ని రోజులుగా ఎలాంటి పనిచేయకుండా తిరుగుతున్నాడు. ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలని తండ్రిని అడిగేవాడు. తన వద్ద డబ్బులు లేవని, పనికెళ్లి డబ్బులు సంపాదించుకోవాలని కొడుకును మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తీసి తన అక్కకు పంపాడు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే నవీన్ పురుగుమందు తాగాడు. నవీన్ వెంటనే మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
చిన్న చిన్న కారణాలకే యువతీయువకులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనగామ(Jangaon) జిల్లాలో ఓ యువతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే(Failed in Exams) మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా అశ్వరావుపల్లిలో యువతి రైలు పడి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే యువతి ఈ దారుణానికి పాల్పడింది. అశ్వరావుపల్లికి చెందిన మస్సి పరమేశ్ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రెండో కూతురు సోని (20) జనగామలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో(Degree college) బీఏ చివరి ఏడాది చదువుతుంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ లో నాలుగు సబ్జెక్టుల్లో సోని ఫెయిల్ అయ్యింది. ఈ విషయాన్ని సోని తల్లిదండ్రులకు చెప్పలేదు. హైదరాబాద్(Hyderabad) ఇంటర్వ్యూకి వెళ్తు్న్నట్లు తమ్ముడికి చెప్పి ఇంట్లోంచి వెళ్లిన యువతి...నిడిగొండ బ్రిడ్జి వద్దకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు...ఘటనాస్థలిలో లభ్యమైన ఐడీ కార్డు ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు.