UP viral news: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించకపోవడంతో ఆ మహిళ పలుమార్లు ఆత్మాహత్య యత్నం చేసింది. మొదట రైలు పట్టాలపై నిల్చుంది. ఆ తరువాత భవనంపై నుంచి కిందకు దూకింది. చివరకు, మూడోసారి ఎలక్ట్రిక్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నించింది.
గోరఖ్ పూర్ లోని గూర్ఖాపూర్ ప్రాంతంలో ఆ మహిళ తన భర్తతో కలిసి ఉంటోంది. వారికి ముగ్గురు పిల్లలు. ఆ మహిళకు గత ఏడేళ్లుగా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి భర్త రామ్ గోవింద్ ఆమెను పలుమార్లు మందలించాడు. అయితే, ఆ మహిళ మారలేదు. పైగా, తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కూడా తమతో పాటు ఇంట్లోనే ఉంచుకోవాలని పట్టుబట్టింది. ఆ వ్యక్తి తమను ఆర్థికంగా కూడా సహాయపడ్తాడని భర్తకు చెప్పింది. అందుకు ఆమె భర్త ఒప్పుకోలేదు.
దాంతో, ఆ మహిళ పలుమార్లు ఆత్మహత్య యత్నం చేసింది. మొదట రైలు పట్టాలపై నిల్చుంది. ఆ తరువాత భవనంపై నుంచి కిందకు దూకింది. చివరకు, మూడోసారి ఎలక్ట్రిక్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నించింది. విద్యుత్ స్తంభంపై నిల్చుని, హై ఓల్టేజీ తీగలను పట్టుకున్న ఆ మహిళకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ స్తంభం నుంచి దిగడానికి నిరాకరిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ తరువాత, కొందరు వ్యక్తులు ఆమెను బలవంతంగా విద్యుత్ స్తంభం నుంచి కిందకు దించుతున్న దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి. అదృష్టవశాత్తూ ఆ మహిళ విద్యుత్ స్తంభంపై ఉన్న సమయంలో కరంటు లేదు.
టాపిక్