TDP Candidate Car Accident : నంద్యాల టీడీపీ అభ్యర్థికి తప్పిన పెను ప్రమాదం, కాపాడిన ఎయిర్ బెలూన్స్!
09 April 2024, 19:26 IST
- TDP Candidate Car Accident : నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గేదెలను ఢీకొట్టింది.
నంద్యాల టీడీపీ అభ్యర్థికి తప్పిన పెను ప్రమాదం
TDP Candidate Car Accident : మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్(NMD Farooq) కి పెద్ద ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఫరూక్ కారు తమ్మరాజు పల్లె వద్ద అదుపుతప్పి గేదెలను ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఫరూక్ కు స్వల్ప గాయాలయ్యాయి.
కాపాడిన ఎయిర్ బెలూన్స్
నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఎం.డి ఫరూక్‌కు(Nandyal TDP Candidate Farooq) పెను ప్రమాదం తప్పింది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద ఫరూక్ ప్రయాణిస్తున్న కారు రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు (Car Accident)ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఎయిర్ బెలూన్స్(Car Air Baloons) వెంటనే ఓపెన్ కావడంతో ఫరూక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఫరూక్ ను నంద్యాలలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఫరూక్ అనుచరులు అంటున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫరూక్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి వస్తున్నారు.
ఈసారి ఫరూక్ కు ఛాన్స్
నంద్యాల టీడీపీ అభ్యర్థి(Nandyal TDP)గా మాజీ మంత్రి, సీనియర్ నేత ఫరూక్(Farooq)కు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. భూమా బ్రహ్మానందరెడ్డిని పక్కకు పెట్టి గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఫరూక్‌ను బరిలో దింపారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల బరిలో ఉన్నారు. శిల్పా ఫ్యామిలీకి నంద్యాలలో గట్టి పట్టు ఉండటంతో టీడీపీ ఫరూక్ ను బరిలో దించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముస్లిం ఓటింగ్ ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు. అయితే బీజేపీతో కూటమి కట్టిన టీడీపీకి ముస్లిం ఓటర్లు ఎంత వరకూ నమ్ముతారో వేచిచూడాలి.