Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, నంద్యాల డబ్లింగ్ పనుల కారణంగా ఈ నెల 27 వరకు పలు రైళ్లు రద్దు
15 December 2024, 23:18 IST
Trains Cancelled: నంద్యాల జిల్లాలో డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. ఈనెల 16 నుంచి 27 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు గుంతకల్లు రైల్వే డీఆర్ఎం విజయకుమార్ ఓ ప్రకటన చేశారు.
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, నంద్యాల డబ్లింగ్ పనుల కారణంగా ఈ నెల 27 వరకు పలు రైళ్లు రద్దు
Trains Cancelled: నంద్యాల జిల్లాలో డబ్లింగ్ పనులు చేపట్టింది రైల్వే శాఖ. పాణ్యం, బుగ్గనపల్లె, కృష్ణమ్మకోన రైల్వేలైన్‌లో డబ్లింగ్ పనుల కారణంగా ఈనెల 16 నుంచి 27 వరకు పలు రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు గుంతకల్లు రైల్వే డీఆర్ఎం విజయకుమార్ ఓ ప్రకటన చేశారు.
గుంటూరు-డోన్ (రైలు నెం.17228), డోన్-గుంటూరు (17227) తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపారు. అలాగే ఈనెల 20వ తేదీన పూరి-యశ్వంతపూర్ (22883), 21న యశ్వంతపూర్-పూరి (22884) రైలును దారి మళ్లించినట్టు చెప్పారు. ఈనెల 18, 25 తేదీల్లో హౌరా-యశ్వంతపూర్ (22831) రైలును నంద్యాల, ఎర్రగుంట్ల, గుత్తి, అనంతరపురం మీదుగా దారి మళ్లించి ప్రకటించారు. ఈ నెల 20న యశ్వంతపూర్-హౌరా ( 22832) రైలును అనంతపురం, గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా దారి మళ్లించారు. గుంటూరు-ఔరంగాబాద్ (17253), ఔరంగాబాద్-గుంటూరు (17254) రైలు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు.
శబరిమల రైళ్లు
అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లపై మరో ప్రకటన చేసింది. వేర్వేరు స్టేషన్ల నుంచి శబరిమలకు 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇందులో కొన్ని సికింద్రాబాద్, కాకినాడ పోర్టు, విజయవాడ, గుంటూరు, నర్సాపూర్ నుంచి నడవనున్నాయి. వీటిలో కొన్ని ఈ నెలలోనే రాకపోకలు ఉండగా... మరికొన్ని రైళ్లు జనవరిలో రాకపోకలు సాగిస్తాయని తాజా ప్రకటనలో పేర్కొంది.
సికింద్రాబాద్ - కొల్లాం మద్య డిసెంబర్ 19,26 తేదీల్లో స్పెష్ ట్రైన్ నడవనుంది. ఇది రాత్రి 8 గంటలకు బయల్దేరి... శనివారం రాత్రి 1.30 గంటలకు కొల్లాంకు చేరుతుంది. ఇక కొల్లాం నుంచి సికింద్రాబాద్ కు కూడా మరో ట్రైన్ కూడా ఉంటుంది. ఇది ఈనెల 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
కాకినాడ పోర్టు నుంచి కొల్లాంకు డిసెంబర్ 18, 25 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇక కొల్లాం నుంచి కాకినాడ పోర్టుకు డిసెంబర్ 20, 27 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. ఇక విజయవాడ నుంచి కూడా కొల్లాంకు స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది డిసెంబర్ 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇక కొల్లాం నుంచి కాకినాడ పోర్టుకు డిసెంబర్ 23, 30 తేదీల్లో ట్రైన్ బయల్దేరుతుంది.
జనవరిలో నడిచే రైళ్లు:
సికింద్రాబాద్ - కొల్లాం మధ్య జనవరి 2, 9,16 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది రాత్రి 8 గంటలకు బయల్దేరి.. శనివారం రాత్రి 1.30 గంటలకు కొల్లాం చేరుతుంది. ఇక కొల్లాం - సికింద్రాబాద్ మధ్య జనవరి 4, 11,18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. మరోవైపు కాకినాడ టౌన్ నుంచి కొల్లాంకు జనవరి 1, 8 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. కొల్లాం నుంచి గుంటూరుకు జనవరి 3, 10 తేదీల్లో ట్రైన్స్ ఉండగా.. మరోవైపు గుంటూరు నుంచి కొల్లాంకు కూడా జనవరి 4,11,18 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నర్సాపూర్ నుంచి కొల్లాంకు జనవరి 15, 22 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఇక కొల్లాం నుంచి నర్సాపూర్ కు జనవరి 17, 24 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ ఉంటాయని పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.