తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa News : క‌డ‌ప జిల్లాలో విషాదం, తెలుగు గంగలో ఈతకు దిగి ముగ్గురు యువ‌కులు మృతి

Kadapa News : క‌డ‌ప జిల్లాలో విషాదం, తెలుగు గంగలో ఈతకు దిగి ముగ్గురు యువ‌కులు మృతి

HT Telugu Desk HT Telugu

29 July 2024, 16:16 IST

google News
    • Kadapa News : కడప జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. తెలుగు గంగ ప్రాజెక్టులో ఈత దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. 
క‌డ‌ప జిల్లాలో విషాదం, తెలుగు గంగలో ఈతకు దిగి ముగ్గురు యువ‌కులు మృతి
క‌డ‌ప జిల్లాలో విషాదం, తెలుగు గంగలో ఈతకు దిగి ముగ్గురు యువ‌కులు మృతి

క‌డ‌ప జిల్లాలో విషాదం, తెలుగు గంగలో ఈతకు దిగి ముగ్గురు యువ‌కులు మృతి

Kadapa News : క‌డ‌ప జిల్లాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. తెలుగు గంగ ప్రాజెక్టులో ప‌డి ముగ్గురు యువ‌కులు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయ‌లు నెల‌కున్నాయి. రిజ‌ర్వాయ‌ర్ లో గ‌ల్లంతైన ఆ ముగ్గురు యువ‌కుల‌ మృతదేహాలను గ‌జ ఈత‌గాళ్లు వెలికి తీశారు.

క‌డ‌ప జిల్లాలోని దువ్వూరు మండ‌లం చ‌ల్లబ‌సాయ‌ప‌ల్లె సమీపంలోని తెలుగు రిజ‌ర్వాయ‌ర్‌ లో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్రాజెక్టులో ప‌డి చ‌నిపోయిన‌వారు ప్రొద్దుటూరు మౌలానా ఆజాద్ స్ట్రీట్‌కు చెందిన పి.ర‌హ‌మ‌తుల్లా, సుంద‌రాచార్యుల వీధికి చెందిన వీ.షాహిద్‌, ప‌వ‌ర్ హౌస్ రోడ్డుకు చెంద‌ని ఎస్‌కే ముదాపీర్‌ల‌గా గుర్తించారు.

ఆదివారం సెలవు కావడంతో సంతోషంగా విహారించ‌డానికి ప్రొద్దుటూరుకు చెందిన ఈ ముగ్గురు యువ‌కులు రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్దకు విహార‌యాత్రకు వెళ్లారు. అనంత‌రం ముగ్గురు యువ‌కులు సెల్‌ఫోన్ ఫొటోలు దిగి అనంత‌రం నీటిలోకి దిగారు. వాటిని సోష‌ల్ మీడియాలో కూడా పొందుప‌రిచారు. రిజ‌ర్వాయ‌ర్‌లో స్నానాలు చేశారు. సంతోషంగా కేరింత‌లు కొట్టారు. అయితే అంత‌లోనే వారిని మృత్యువు వేటాడింది. వారిని త‌న‌తో తీసుకెళ్లిపోయింది. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు జ‌లాశ‌యం వ‌ద్దకు చేరుకుని గాలించారు. అయితే ఎక్కడా వారు క‌న‌బ‌డ‌లేదు. కానీ ఆ ముగ్గురు యువ‌కుల‌కు సంబంధించిన దుస్తులు, సెల్‌ఫోన్లు, చెప్పులు ఉన్నాయి. వాటిని చూసి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది.

కుటుంబ స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల‌కు కుటుంబ స‌భ్యులు మొత్తం వివ‌రించారు. దీంతో పోలీసులు ఘ‌ట‌నా స్థలాన్ని చేరుకుని గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు. గ‌జ ఈతగాళ్ల సాయంతో యువ‌కుల మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. ఈ సంద‌ర్భంగా ఎస్ఐ శ్రీ‌నివాసులు అందించిన వివ‌రాల ప్రకారం ముగ్గురు యువ‌కులు సెల్‌ఫోన్ లో ఫొటోలు దిగి అనంత‌రం నీటిలోకి దిగార‌ని తెలిపారు.

నీటిలో మునిగి గ‌ల్లంత‌యిన‌ట్లు తెలిసింద‌న్నారు. గ‌ట్టుపై దొరికిన సెల్‌ఫోన్లు, ప‌ర్సులు ఆధారంగా యువ‌కులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించామ‌ని పోలీసులు అన్నారు. గాలింపు చ‌ర్యల్లో యువ‌కుల మృతదేహాలు దొరికాయ‌ని, వాటిని బ‌య‌ట‌కు తీశామ‌ని తెలిపారు. ఆ త‌రువాత పోస్టుమార్టం కోసం ఆసుప్రతికి త‌రలించామ‌ని పేర్కొన్నారు. కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌బ‌డుతున్నామ‌ని అన్నారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం