Tollywood: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్ర‌హ్మానందం కామెడీ మూవీ వీరాంజ‌నేయులు విహార‌యాత్ర - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-brahmanandam telugu comedy movie veeranjaneyulu vihara yatra directly streaming etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tollywood: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్ర‌హ్మానందం కామెడీ మూవీ వీరాంజ‌నేయులు విహార‌యాత్ర - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Tollywood: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్ర‌హ్మానందం కామెడీ మూవీ వీరాంజ‌నేయులు విహార‌యాత్ర - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 17, 2024 09:30 AM IST

Tollywood: బ్ర‌హ్మానందం, సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న తెలుగు కామెడీ మూవీ వీరాంజ‌నేయులు విహార‌యాత్ర మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈటీవీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

బ్ర‌హ్మానందం వీరాంజ‌నేయులు విహార‌యాత్ర
బ్ర‌హ్మానందం వీరాంజ‌నేయులు విహార‌యాత్ర

Tollywood: తెలుగు కామెడీ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. భామ‌క‌లాపం త‌ర్వాత నిర్మాత‌లు బీ బాపినీడు, సుధీర్ ఈద‌ర క‌లిసి వీరాంజ‌నేయులు విహార‌యాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుధీర్ పుల్ల‌ట్ల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

బ్ర‌హ్మానందం, న‌రేష్ కీల‌క పాత్ర‌లు...

వీరాంజ‌నేయులు విహార‌యాత్ర సినిమాలో సీనియ‌ర్ న‌రేష్ తో పాటు బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. కీడాకోలా ఫేమ్ రాగ్‌మ‌యూర్‌, ప్రియావ‌డ్ల‌మాని హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్నఈ సినిమా డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది.

గోవా టూర్‌...

ఇటీవ‌ల ఈసినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ పాత‌కాలం నాటి వ్యాన్‌లో గోవాకు ఓ ఫ్యామిలీ మొత్తం గోవా టూర్ వెళుతున్న‌ట్లుగా చూపించారు. వ్యాన్‌పైన ల‌గేజీతో పాటు అస్తిక‌ల‌తో కూడిన చిన్న కుండ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. గోవా రోడ్ ట్రిప్‌లో ఓ ఫ్యామిలీ ఎదురైన ఇబ్బందులు, క‌ష్టాల‌ను ఫ‌న్నీగా ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌లో బ్ర‌హ్మానందం క్యారెక్ట‌ర్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీతోనే బ్ర‌హ్మానందం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. కీడాకోలా హిట్ త‌ర్వాత బ్ర‌హ్మానందం, రాగ్‌మ‌యూర్ క‌లిసి చేస్తోన్న మూవీ ఇది.

త్వ‌ర‌లో స్ట్రీమింగ్‌..

మోస్ట్ ఎంట‌ర్‌టైనింగ్ రోడ్ ట్రిప్ ఆఫ్ ది ఇయ‌ర్ అనే క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. వీరాంజ‌నేయులు విహార‌యాత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈటీవీ విన్ ఓటీటీలో ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమాకు ఆర్‌హెచ్ విక్ర‌మ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

న‌రేష్ బిజీ....

సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో న‌టిస్తూ న‌టుడిగా బిజీగా ఉన్నాడు సీనియ‌ర్ న‌రేష్‌. గ‌త ఏడాది మ‌ళ్లీ పెళ్లి పేరుతో ఓ సినిమాను నిర్మించాడు. త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తోనే న‌రేష్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ గేమ్‌ఛేంజ‌ర్‌లో ఓ డిఫ‌రెంట్ రోల్‌లో న‌రేష్ క‌నిపించ‌బోతున్నాడు. గ‌త కొన్నాళ్లుగా సినిమాల వేగాన్ని త‌గ్గించాడు బ్ర‌హ్మానందం. గ‌త ఏడాది రిలీజైన బ్రో, భోళాశంక‌ర్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు. చాలా రోజుల త‌ర్వాత కీడాకోలా సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు బ్ర‌హ్మానందం. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో వ‌ద‌ర‌రాజులు అనే పాత్ర‌లో త‌న కామెడీ టైమింగ్‌తో అల‌రించారు బ్ర‌హ్మానందం.

ఓం భీమ్ బుష్‌లో స్పెష‌ల్ సాంగ్‌...

ప్రేమ‌కు రెయిన్‌చెక్ అనే చిన్న సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియా వ‌డ్ల‌మాని. హుషారు, ఆవిరి,ముఖ‌చిత్రం, మ‌ను చ‌రిత్ర సినిమాల్లో క‌థానాయిక‌గా క‌నిపించింది. లేటెస్ట్ కామెడీ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఓం భీమ్‌బుష్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది.

టాపిక్