తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Araku Tour: అరకు వ్యాలీ టూర్.. ఒక్క రోజు ట్రిప్ ధర ఎంతంటే

IRCTC Araku Tour: అరకు వ్యాలీ టూర్.. ఒక్క రోజు ట్రిప్ ధర ఎంతంటే

HT Telugu Desk HT Telugu

16 December 2022, 21:55 IST

google News
    • Visakhapatnam Araku IRCTC Tour: విశాఖపట్నం నుంచి అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
విశాఖ - అరకు టూర్
విశాఖ - అరకు టూర్ (facebook)

విశాఖ - అరకు టూర్

IRCTC Tourism Visakhapatnam Araku Tour: వేర్వురు ప్రదేశాలను చూసేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా విశాఖపట్నం నుంచి అరకు అందాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

Visakhapatnam Araku tour details: ప్రస్తుతం ఈ టూర్ డిసెంబర్ 21వ తేదీన అందుబాటులో ఉంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే టూర్ ముగుస్తుంది.

Day 01 Thursday: ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైన్ అరకు వ్యాలీకు వెళ్తుంది. ఈ రైలు టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు.

అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత... బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్ కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ ముగుస్తుంది.

ధరలివే.....

Visakhapatnam Araku Tour Cost: ఈ ఒక్క రోజు ప్యాకేజీకి వచ్చే 3వేల లోపు వరకు ధరలు ఉన్నాయి. చిన్నారులకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. వెళ్లే కోచ్ ను బట్టి కూడా ధరలు ఉన్నాయి. వాటి కోసం కింద ఇచ్చిన టేబుల్ లో చూసుకోవచ్చు.

ధరల వివరాలు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం