తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Irctc Vizag To Andaman Tour : అండమాన్ వెళ్లాలనుందా? అయితే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ చూడండి

IRCTC Vizag To Andaman Tour : అండమాన్ వెళ్లాలనుందా? అయితే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ చూడండి

Anand Sai HT Telugu

07 September 2022, 14:34 IST

    • IRCTC Tour Package : అండమాన్ దీవుల్లోకి వెళ్లాలనిపిస్తుందా? బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవులు పర్యాటకులకు మంచి అనుభూతినిస్తాయి. సుమారు 300 ద్వీపాలు, అందమైన బీచ్‌లతో ఆకట్టుకునేలా ఉంటాయి ఈ దీవులు. వీటిని చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఇందులో భాగంగానే అండమాన్ దీవులను చూడాలనుకునే వారి కోసం ఓ ప్యాకేజీ ప్రకటించింది. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లు చూడాలనుకుంటే తప్పకుండా ఈ దీవులకు వెళ్లాల్సిందే. అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ LTC SPECIAL ANDAMAN EMERALDS EX VISHAKHAPATNAM పేరుతో ప్యాకేజీ అందిస్తోంది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. HAVELOCK, PORT BLAIR, వివిధ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఫ్లైట్లో తీసుకెళ్తారు. 28.01.2023న ఈ టూర్ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

AP Weather Updates: పగలు మండే ఎండలు, సాయంత్రానికి భారీ వర్షాలు, ఏపీకి ఐఎండి తీపి కబురు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

Day 1

విశాఖపట్నం నుంచి 08:40 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. 12:50 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం సెల్యులార్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ సందర్శి్స్తారు. తర్వాత సెల్యులార్ జైలులో లైట్, సౌండ్ షో చూడొచ్చు. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఉంటుంది.

Day 2

హోటల్ లో అల్పాహారం చేసి.. రాస్ ఐలాండ్ బయలుదేరుతారు. తర్వాత నార్త్ బే సందర్శన ఉంటుంది. భోజనం తర్వాత నేవల్ మెరైన్ మ్యూజియం సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.

Day 3

అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. హావ్‌లాక్ ద్వీపానికి తీసుకెళ్తారు. అక్కడ , హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. ఎలిఫెంట్ బీచ్‌కి వెళ్లి వాటర్ స్పోర్ట్ ఎంజాయ్ చేయోచ్చు. సాయంత్రం రాధానగర్ బీచ్ సందర్శన ఉంటుంది. హావ్‌లాక్ ద్వీపంలో రాత్రి బస చేస్తారు.

Day 4

హోటల్ లో అల్పాహారం చేసి.. చెక్ అవుట్ చేయాలి. తర్వాత కాలాపత్తర్ బీచ్ సందర్శిస్తారు. నీల్ ద్వీపం కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాలి. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్‌కు వెళ్లి చెక్ ఇన్ చేయాలి. రిఫ్రెష్ అయిన తర్వాత సహజ వంతెన, లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. నీల్ ద్వీపంలోనే రాత్రి డిన్నర్, బస ఉంటుంది.

Day 5

ఉదయాన్నే భరత్‌పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని ఆస్వాదించొచ్చు. అల్పాహారం ముగించుకుని హోటల్ నుండి చెక్ అవుట్ చేయాలి. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. విశ్రాంతి, షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లోనే రాత్రి భోజనం, బస ఏర్పాటు చేస్తారు.

Day 6

హోటల్ లో అల్పాహారం చేసి చెక్అవుట్ చేయాలి. 07:45 గంటలకు విశాఖపట్నం వెళ్లే విమానం ఉంటుంది. 11:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.63525గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.47270 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.45765గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

తదుపరి వ్యాసం