Breakfast Ideas| ఉదయం ఇలాంటి అల్పాహారం చేయాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు!
- గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో తీసుకోవటం ద్వారా మంచి ఎనర్జీ లభిస్తుంది. వీటితో పాటు పుదీనా-కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు పెరుగుతాయి. ఉదయాన్నే శక్తినిచ్చే అల్పాహారాలు ఇవిగో
- గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో తీసుకోవటం ద్వారా మంచి ఎనర్జీ లభిస్తుంది. వీటితో పాటు పుదీనా-కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు పెరుగుతాయి. ఉదయాన్నే శక్తినిచ్చే అల్పాహారాలు ఇవిగో
(1 / 6)
రోజు ప్రారంభం అవగానే అల్పాహారంతో ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్పాహారం రోజులో ముఖ్యమైన ఆహారం కావున ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలి. న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ తక్షణమే శక్తిని అందించే కొన్ని అల్పాహారాల గురించి వివరించింది.(Unsplash)
(2 / 6)
ఉడికించిన గుడ్లు, టోస్ట్‌లు అల్పాహారంలో చేర్చుకోవాలి. వీటితో తాజాగా లభించే పుదీనా-కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే పోషక విలువలు మరింత పెరుగుతాయి.(Unsplash)
(3 / 6)
దోశ చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. దోశలో పోషక విలువలు బాగానే ఉంటాయి. అయితే మరింత శక్తి కోసం పెసర్లతో చేసే దోశ, గ్రీన్ చట్నీ, టొమాటో-క్యారెట్ రసంతో కలిపి తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ అంజలి సూచించారు.(Unsplash)
(4 / 6)
గోబీ పరాటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే పెరుగుతో కలిపి గోబీ పరాటా అలాగే బూడిద పొట్లకాయ జ్యూస్ తాగితే మంచిది.(Unsplash)
(5 / 6)
ఉదయం వేళ ఎక్కువ తినలేని వారు ఉడికించిన గుడ్లు, కొన్ని బాదంపప్పులు, ఒక గ్లాసు టొమాటో సెలెరీ జ్యూస్‌తో పవర్-ప్యాక్డ్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని అంజలి సూచించారు.(Unsplash)
(6 / 6)
పండ్లలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి కాబట్టి అల్పాహారంలో చేర్చుకోవాలి. ఉదయాన్నే ఒక కప్ తాజా పండ్ల ముక్కలను తీసుకుంటే అది శరీరానికి అవసరమైన పోషకాలను అందజేస్తుంది.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు