Russian Tourists | రష్యన్ పర్యాటకులపై ట్రావెల్ బ్యాన్ విధించనున్న EU దేశాలు..!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఇతర దేశాలకు ప్రయాణించే రష్యా పర్యాటకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా యురోపియన్ దేశాలు రష్యన్ పర్యాటకులపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రష్యా పట్టించుకోకపోవటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా తమ దేశాల్లో పర్యటించే రష్యన్ పౌరులకు సులభతర వీసా ఒప్పందాన్ని నిలిపివేయడానికి EU మంత్రులు నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక సూచిస్తుంది. కొన్ని సభ్య దేశాలు ఇప్పటికే తమ దేశంలోకి రష్యా ప్రయాణికుల ప్రవేశాన్ని నిషేధించగా, మరికొన్ని 'సమిష్టి చర్య'కు పిలుపునిచ్చాయి. ఇది ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీసింది. ప్రయాణికులపై ఆంక్షలు ఎందుకు అని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది మళ్లీ ఎంతవరకు వెళ్తుందోననే ఆందోళన మొదలైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.