తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rain Alert To Ap: వాయుగుండం ఎఫెక్ట్…. మరో 2 రోజులు వర్షాలు

Rain Alert to AP: వాయుగుండం ఎఫెక్ట్…. మరో 2 రోజులు వర్షాలు

HT Telugu Desk HT Telugu

23 November 2022, 7:48 IST

google News
    • Rains in Andhrapradesh: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. 
ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

ఏపీకి వర్ష సూచన

Weather Updates Andhrapradesh:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవనకాశం ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇప్పటికే బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వాయుగుండం.. తుఫానుగా మారే అవకాశాలు కనిపించట్లేదు. ఇది ఇవాళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో చలి గాలుల వేగం పెరుగుతుంది. ఫలితంగా ప్రకాశం , నెల్లూరు , రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవటంతో పాటు చలి గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రానున్న రెండురోజులు కోస్తాలో ఒకటిరెండు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

వాయుగుండం ప్రభావం చెన్నై మీదుగా అంతగా లేదని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపింది. తిరుపతి నగరం, తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని పేర్కొంది. కడప​, అన్నమయ్య​, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, సత్యసాయు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయనని... కోనసీమ​, ఉభయగోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయని పేర్కొంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో చలి విజృంభిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది పగటి పూట ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంతవరకూ చలిగాలులు మన శరీరానికి తగలకుండా చూసుకోవాలని.. బయట తిరగడం తగ్గించుకోవాలని చెబుతున్నారు. ఏవైనా పనులు ఉంటే.. ఉదయం పది తర్వాత.. సాయంత్రం ఐదు లోపు ముగించుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తదుపరి వ్యాసం