CM Jagan : రూ.193.31 కోట్ల వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం నిధులు విడుదల
25 August 2022, 15:08 IST
- YSR Nethanna Nestham : ప్రభుత్వ చర్యలతో చేనేత ఉత్పత్తుల ఆదాయం మూడింతలు పెరిగిందని సీఎం జగన్ తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా చేశామన్నారు.
వైఎస్ఎర్ నేతన్న నేస్తం నిధులు విడుదల
వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా పెడనలోని పర్యటనలో భాగంగా.. 80,546 మంది నేతన్నల ఖాతాల్లో 193.31 కోట్లు జమ చేశారు. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.776 కోట్లు అందించామని సీఎం తెలిపారు. ప్రతి నేతన్న కుటుంబానికి రూ.96 వేలు ఇచ్చామన్నారు. సొంతమగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24 వేలు సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
'వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా రూ.776 కోట్లు అందించాం. ప్రతి నేతన్న కుటుంబానికి రూ.96 వేలు ఇచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా చేశాం. చేనేత వస్త్రాలకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాం. ఆన్‌లైన్ ద్వారా చేనేతల ఉత్పత్తుల విక్రయానికి అవకాశం ఇచ్చాం. మన సంస్కృతి, సంప్రదాయాలకు నేతన్నలు నిదర్శనం. మొత్తం నేతన్నల సంక్షేమం కోసం 2049 కోట్లు ప్రభుత్వం అందించింది. వైసీపీ ప్రభుత్వం బీసీలకు రాజకీయంగానూ అండగా ఉంటుంది. పెద్ద ఎత్తున పదవులు ఇచ్చి సామాజిక న్యాయం అంటే ఏంటో చూపించింది.' అని సీఎం జగన్ అన్నా్రు.