CM Jagan : 26న విశాఖకు సీఎం జగన్.. సాగర తీర పరిరక్షణ కోసం ఎంవోయూ-cm jagan visit vizag on aug 26 to sign mou with parley ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : 26న విశాఖకు సీఎం జగన్.. సాగర తీర పరిరక్షణ కోసం ఎంవోయూ

CM Jagan : 26న విశాఖకు సీఎం జగన్.. సాగర తీర పరిరక్షణ కోసం ఎంవోయూ

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 07:58 PM IST

సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 26న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పార్లే ఫర్ ది ఓషన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం(MOU)పై సంతకం చేస్తుంది. మరికొన్ని కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు.

<p>సీఎం జగన్</p>
సీఎం జగన్

ఆగస్టు 26న విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సాగర తీర పరిరక్షణ కోసం అమెరికాకు చెందిన పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య బీచ్‌ పరిరక్షణపై ఎంవోయూ జరగనుంది. సాగర గర్భంలో, తీరం వెంబడి ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని పార్లే సంస్థ సేకరించి వాటిని రీ సైకిల్‌ చేసేందుకు పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఒప్పంద కార్యక్రమాన్ని ఈ నెల 26న ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న 5 వేల మందికి ఉపాధి శిక్షణ ఇచ్చింది. అయితే శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏయూ ఇంజినీరింగ్‌ మైదానంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్లు తీసుకోనున్నారు. మరోవైపు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి మధ్య 28 కిలోమీటర్ల మేర సీఎం పర్యటన సందర్భంగా జీవీఎంసీ మెగా బీచ్‌ క్లీనప్‌ డ్రైవ్‌ చేపట్టనుంది.

సీఎం జగన్ పర్యటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈనెల 26న సీఎం విశాఖపట్నం వస్తున్నారని తెలిపారు. సముద్రములో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, మళ్లీ ఉపయోగించే అంశంపై పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుందన్నారు. ఈ నెల 26న 25 వేల మందితో 39 లోకేషన్స్‌లో సముద్రంలో ఉన్న ప్లాస్టిక్‌ను సేకరిస్తామని తెలిపారు. సముద్రంలో సేకరించిన వ్యర్ధాలను అడిడాస్ షూస్ తయారీలో ఉపయోగిస్తారని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన 9200 మందికి సీఎం చేతుల మీదగా సర్టిఫికెట్లు అందించనున్నట్టుగా వెల్లడించారు.

Whats_app_banner