తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Weather Update: మండుతున్న ఎండలు, ఏపీలో 46, తెలంగాణలో 44డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిప్పుల కొలిమిలా వాతావరణం

AP TS Weather Update: మండుతున్న ఎండలు, ఏపీలో 46, తెలంగాణలో 44డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిప్పుల కొలిమిలా వాతావరణం

Sarath chandra.B HT Telugu

17 April 2024, 7:49 IST

    • AP TS Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల్లాడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీలో 46డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. 
ఏపీ తెలంగాణలో ఎండలు
ఏపీ తెలంగాణలో ఎండలు (unsplash.com)

ఏపీ తెలంగాణలో ఎండలు

AP TS Weather Update: ఏపీ, తెలంగాణల్లో ఎండలు Summer మండిపోతున్నాయి. ఏపీలో టెంపరేచర్‌ temperature 45డిగ్రీలకు చేరువకు చేరితే, తెలంగాణ Telanganaలో 44డిగ్రీలకు దగ్గర్లో ఉంది. రెండు రాష్ట్రాల్లో ఎండలు సుర్రుమంటున్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

AP EAPCET 2024: రేపే ఏపీ ఈఏపీ సెట్ 2024, ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్‌టియూ-కే, 3.61లక్షల మంది దరఖాస్తు

ParchurBus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం,టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం

P Gannavaram Accident : పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం- కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు దుర్మరణం!

AP High Tension : రణరంగంలా మారిన ఏపీ, తిరుపతిలో విధ్వంసం- పల్నాడు, తాడిపత్రిలో రాళ్లదాడులు

ఐఎండి IMD సూచనల ప్రకారం బుధవారం ఏపీలో 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 175 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే గురువారం 67 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 213 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ SDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

రాబోవు నాలుగు రోజుల ఏపీలో ఉష్ణోగ్రతల అంచనాలు..

ఏప్రిల్‌ 17 బుధవారం…

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్‌ 18 గురువారం

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి,చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్‌ 19 శుక్రవారం

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్‌ 20 శనివారం

అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

మంగళవారం మండిపోయిన ఎండలు…

మంగళవారం శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4°C, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45.2°C, అనకాపల్లి జిల్లా రావికమతం 45.1°C, మన్యం జిల్లా మక్కువలో 44.4°C, నంద్యాల జిల్లా గోస్పాడులో 44.3°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 43.9°C, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లులో 43.8°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.8°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 88 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 89 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. డీ హైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

బుధవారం తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు( 46 ) :-

బుధవారం రాష్ట్రంలోని శ్రీకాకుళం 12 , విజయనగరం 18, పార్వతీపురంమన్యం12, విశాఖపట్నం, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.

శ్రీకాకుళం 11 , విజయనగరం 6, పార్వతీపురంమన్యం 3, అల్లూరిసీతారామరాజు 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 15, కోనసీమ 9, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 3, ఏలూరు 13, కృష్ణా 10, ఎన్టీఆర్ 6, గుంటూరు 15, పల్నాడు 22, బాపట్ల 2, ప్రకాశం 8, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 1, తిరుపతి 3 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో 45డిగ్రీలకు చేరువలో టెంపరేచర్…

తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం తొమ్మిది జిల్లాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో 44.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఖమ్మం నగరంలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 5.1 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తున్నాయని ఐఎండి హెచ్చరించింది. బుధ, గురు వారాల్లో కూడా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ఎండల తీవ్రతకు ఇద్దరు చనిపోయారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌కు చెందిన చిట్ల్ రామక్క హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమారుడి దగ్గర నుంచి మంగళవారం స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చిన కాసేపటికే ప్రాణాలు విడిచారు. సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో రోడ్డుపై సీసాలు ఏరుకుని జీవించే సంగం సుందరయ్య వడదెబ్బతో రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు.

తదుపరి వ్యాసం