తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Hindupur To Dada Pahad : హిందూపురం నుంచి దాదాప‌హాడ్ ద‌ర్గా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ స‌ర్వీస్‌లు

Hindupur To Dada Pahad : హిందూపురం నుంచి దాదాప‌హాడ్ ద‌ర్గా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ స‌ర్వీస్‌లు

HT Telugu Desk HT Telugu

30 June 2024, 18:12 IST

google News
    • Hindupur To Dada Pahad APSRTC Buses : హిందూపురం నుంచి పవిత్ర దర్గా దాదాపహాడ్ కు ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు నడుపుతోంది. ప్రతివారం రెండు స‌ర్వీసుల‌ను అందుబాటులోకి ఉన్నాయి.
హిందూపురం నుంచి దాదాప‌హాడ్ ద‌ర్గా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ స‌ర్వీస్‌లు
హిందూపురం నుంచి దాదాప‌హాడ్ ద‌ర్గా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ స‌ర్వీస్‌లు

హిందూపురం నుంచి దాదాప‌హాడ్ ద‌ర్గా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ స‌ర్వీస్‌లు

Hindupur To Dada Pahad APSRTC Buses : దేశంలోని పవిత్ర దర్గాల్లో గొప్పగా చెప్పుకునే దాదాపహాడ్ దర్గా యాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) బ‌స్ సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది. హిందూపురం నుంచి దాదాపహాడ్‌కు సూప‌ర్ ల‌గ్జరీ స్పెష‌ల్ బ‌స్ స‌ర్వీస్‌ను వేసింది. ఈ స‌ర్వీస్‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ కోరుతోంది. ఇత‌ర ఆధ్యాత్మిక ప్రాంతాల ప‌ర్యట‌న స‌ర్వీసులానే ఈ బ‌స్సు స‌ర్వీస్‌లు కూడా రెండు ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుకు తీసుకెళ్తుంది. ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్రత్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్రయాణికులు, యాత్రికులు అత్యధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షత‌మైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే ముస్లిం ప‌విత్ర సంద‌ర్శన ప్రాంతాలైన క‌ర్ణాట‌కలోని చిక్కమంగుళూరులో దాదాపహాడ్ దర్గా, బాన‌వారలోని స‌య్యద్ ఖ‌లంద‌ర్ షా బాబా ద‌ర్గాకు ఈ బస్సు స‌ర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.

ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జరీ బ‌స్సు స‌ర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్లతో హిందూపురం నుంచి క‌ర్ణాట‌క‌లోని చిక్కమంగ‌ళూరులో దాదాపహాడ్ ద‌ర్గా యాత్రకు యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ప్రతివారం రెండు స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒక‌టి గురువారం, మ‌రొక‌టి శ‌నివారం ప్రారంభం అవుతాయి. హిందూపురంలో ప్రతి గురువారం మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు బ‌స్సు బ‌య‌లుదేరుంది. అదే రోజు రాత్రి 8.00 గంట‌ల‌కు చిక్కమంగుళూరులోని దాదాప‌హాడ్‌కు చేరుతుంది. మధ్యలో బాన‌వార‌లోని స‌య్యద్ ఖ‌లంద‌ర్ షా బాబా ద‌ర్గాను సంద‌ర్శన జ‌రుగుతుంది. శుక్రవారం ఉద‌యం దాదాప‌హాడ్ ద‌ర్గాలో ప్రార్థన‌లు చేసుకుని, సాయంత్రం 5.00 గంట‌ల వ‌ర‌కు దాదాప‌హాడ్‌లోనే ఉండి తిరిగి ప్రయాణం అవుతారు. సాయంత్రం 5.00 గంట‌ల‌కు బ‌య‌లుదేరి అదే రాత్రి హిందూపురానికి చేరుకుంటారు.

అలాగే ప్రతి శ‌నివారం సాయంత్రం 5.00 గంట‌ల‌కు హిందూపురంలో బ‌స్సు బ‌య‌లుదేరి, రాత్రి 12.00 గంట‌ల‌కు దాదాప‌హాడ్ చేరుకుంటుంది. మార్గ మధ్యలో బాన‌వార‌లోని స‌య్యద్ ఖ‌లంద‌ర్ షా బాబా ద‌ర్గాను సంద‌ర్శన జ‌రుగుతుంది. ఆదివారం ఉద‌యం దాదాప‌హాడ్ ద‌ర్గాలో ప్రార్థన‌లు చేసుకుని, సాయంత్రం 5.00 గంట‌ల వ‌ర‌కు దాదాప‌హాడ్‌లోనే ఉండి తిరిగి ప్రయాణం అవుతారు. సాయంత్రం 5.00 గంట‌ల‌కు బ‌య‌లుదేరి అదే రాత్రి హిందూపురానికి చేరుకుంటారు.

టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.1,480గా ఆర్టీసీ నిర్ణయించింది. టిక్కెట్టు కావాల‌నుకునేవారు ఈ ఫోన్ నంబ‌ర్లు 9440834715 (ఎవీవీ ప్రసాద్‌), 7382863007, 7382861308ల‌ను సంప్రదించాలి. యాత్రికులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని హిందూపురం డిపో మేనేజ‌ర్ శ్రీ‌కాంత్ తెలిపారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం