TGRTC : స్వర్ణగిరి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త - నేటి నుంచి ప్రత్యేక బస్సులు
TGRTC Buses to Swarnagiri: స్వర్ణగిరి ఆలయానికి వెెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
TGRTC Buses to Swarnagiri Temple: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవలే ప్రారంభమైన స్వర్ణగిరి ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లే భక్తులంతా ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు.
హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి అలాయనికి ప్రత్యేక బస్సులు నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే నేటి నుంచే ఈ ప్రత్యేక సర్వీస్ బస్సులు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి అని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఈ సమయాల్లో ప్రత్యేక బస్సులు…
జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి రెండు ఈ - మెట్రో ఎక్స్ ప్రెస్ నాన్ ఏసి బస్సులను ఆలయానికి నడపనునట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులు ప్రతీ రోజూ ఉదయం 7,8 గంటలకు జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి బయల్దేరి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుంటాయి. ఇక మధ్యాహ్నం 2:50,3:50 గంటలకు తిరిగి ఆలయాం నుంచి హైదరాబాద్ బయలుదేరుతాయి.
ఇక ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి ఆ ఆలయానికి ప్రతిరోజూ ఉదయం 7:30,8:30,10:30,11:35 గంటలకు అలాగే మధ్యాహ్నం 3:20 గంటలకు, సాయంత్రం 4:20,6:25,7:25 గంటలకు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. స్వర్ణగిరి ఆలయం నుంచి జేబియస్ బస్ స్టేషన్ కు మధ్యాహ్నం 12:10,1:10 గంటలకు అలాగే రాత్రి 8,9 గంటలకు బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
ఆలయం నుంచి తిరిగి ఉప్పల్ క్రాస్ రోడ్స్ సాయంత్రం 4:45,5:45 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే జేబీఎస్ నుంచి వెళ్లే బస్సులో ఒక్కొకరికి టికెట్ ధర రూ.100, ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్లే బస్సులో రూ.80 గా అధికారులు నిర్ణయించారు.
బస్ పాస్ గడువు పొడిగించిన ఆర్టీసీ
రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు బస్ పాస్‌ల గడువును మూడు నెలల పాటు టీజీఎస్‌ఆర్టీసీ పొడిగించింది. అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. కాలపరిమితి పొడిగించిన ఈ బస్ పాస్‌లను గతంలో మాదిరిగానే https://tgsrtcpass.com/journalist.do?category=Fresh లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుల్లో జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో, అక్రిడిటేషన్ కార్డులను విధిగా అప్‌లోడ్ చేయాలి. బస్ పాస్ కలెక్షన్ సెంటర్‌నూ ఎంపిక చేసుకోవాలి. ఈ దరఖాస్తులను సమాచార, పౌరసంబంధాల శాఖ ఆన్ లైన్ లో ధ్రువీకరించిన తర్వాత జర్నలిస్టులకు బస్ పాస్‌లను టీజీఎస్‌ఆర్టీసీ జారీ చేస్తుందని ఆర్టీసీ సంస్థ తెలిపింది.