Hyderabad NIMS Jobs 2024 :హైదరాబాద్ నిమ్స్‌లో ఉద్యోగాలు - లక్షకుపైగా జీతం, ముఖ్య వివరాలివే
Hyderabad NIMS Recruitment 2024: ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ నిమ్స్ (NIMS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జూన్ 26వ తేదీతో పూర్తి కానుంది.
Hyderabad NIMS Recruitment 2024 : హైదరాబాద్ నిమ్స్ (నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్ లైన్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోని ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.
జూన్ 26వ తేదీలోపు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. https://nims.edu.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను పొందవచ్చు. పోస్టుల వివరాలతో పాటు పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను చూడొచ్చు.
ముఖ్య వివరాలు :
- జాబ్ నోటిఫికేషన్ - నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థ, హైదరాబాద్.
- మొత్తం పోస్టులు - 51 (సీనియర్ రెసిడెంట్).
- ఖాళీల విభాగాలు: రేడియాలజీ అండ్ ఇమేజియాలజీ,వైద్య ఇమ్యునాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జెనెటిక్స్, హేమటాలజీ, న్యూరాలజీ, రేడియేషన్ అంకాలజీ,మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్, పాథాలజీ, అనస్థీషియాలజీ అండ్ క్రిటికల్ కేర్, గైనకాలజీ.
- అర్హతలు - సంబంధిత స్పెషాలిటీలో MD/MS/DNB ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం కూడా ఉండాలి.
- జీతం - నెలకు రూ.1,21,641 చెల్లిస్తారు.
- ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ప్రతి డాక్యూమెంట్ జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ లో అడిగిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అసంపూర్ణంగా ఉంటే రిజెక్ట్ చేస్తారు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తు ఫీజు - రూ. 500 చెల్లించాలి.
- పూర్తి చేసిన దరఖాస్తులను డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://www.nims.edu.in/recruitment?
హైదరాబాద్ 'బెల్' నోటిఫికేషన్ :
ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా మొత్తం 32 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జూలై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. శాశ్వత ప్రతిపాదికన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ నోటిఫికేషన్ - భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హైదరాబాద్
- మొత్తం ఖాళీలు - 32
- ఉద్యోగాల వివరాలు - ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రెయినీ 12, టెక్నీషియన్ ‘సి’ - 17, జూనియర్ అసిస్టెంట్ 3 ఖాళీలు ఉన్నాయి.
- అర్హత- ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, BBM కోర్సులో పాసై ఉండాలి. ఇందులో పోస్టును అనుసరించి అర్హతలు నిర్ణయించారు. పైన ఇచ్చిన పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ లో వివరాలను తెలుసుకోవచ్చు.
- వయోపరిమితి - 28 ఏళ్లు మించవద్దు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు Relaxation ఉంటుంది.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు రుసుం - జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
- పేమెంట్ లింక్ - https://www.onlinesbi.sbi/sbicollect/icollecthome.htm? corpID=14842
- ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
- ఎంపిక ప్రక్రియ - షార్ట్‌లిస్ట్, రాత పరీక్షలు ఉంటాయి.
- దరఖాస్తు చివరి తేదీ - 11 జూలై 2024.
- దరఖాస్తు లింక్ - https://jobapply.in/bel2024HYDEATTECHJA
- ఏమైనా సందేహాలు ఉంటే hydhrgen@bel.co.in మెయిల్ లేదా 040- 27194999 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.