Bharat Electronics Limited Hyderabad Recruitment 2024: ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా మొత్తం 32 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జూలై 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. శాశ్వత ప్రతిపాదికన ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు.
అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు ఎంపికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపిక పరీక్షకు అవివాహితులైన భారతీయెలైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుండి వాయుసేన ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అగ్నివీర్ నియామకాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2024 జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. జూలై 28వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. 2024 అక్టోబర్ 18నుంచి ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ల కోసం https://agnipathvayu.cdac.in కోసం సందర్శించాల్సి ఉంటుంది. అగ్నివీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే వారు 2004 జూలై 3 నుంచి 2008 జనవరి 3 మధ్యకాలంలో జన్మించాల్సి ఉంటుంది.
అగ్నివీర్ వాయుసేన ఎంపికల కోసం రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.550/- ప్లస్ GST చెల్లించాల్సి ఉంటుంది. అగ్నివీర్ వాయు ఎంపికలు 02/2025 విద్యార్హతలు, వైద్య ప్రమాణాలు, నియమ నిబంధనలతో పాటు నోటిఫికేషన్ పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తులు పూరించడానికి సూచనలు, రిజిస్ట్రేషన్ కోసం https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్ సందర్శించాల్సి ఉంటుంది.అర్హతల వివరాలను కూడా ఇదే సైట్ లో చూడొచ్చు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.