తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

16 December 2024, 18:12 IST

google News
  • AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం ఎఫెక్ట్ తో రేపు, ఎల్లుండి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు

AP Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో రేపు(మంగళవారం) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి(బుధవారం) నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని వెల్లడించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

డిసంబర్ 17, మంగళవారం :

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఏపీలోని మన్యం, విశాఖ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతున్నాయి. తెలంగాణలో చలి పంజా విసురుసుతోంది. చలి గాలుల తీవ్రత పెరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదు అవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి గ్రామంలో అత్యల్పంగా 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. నిర్మల్ జిల్లా మామడలో 6.6 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో 6.7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.8 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తదుపరి వ్యాసం