తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు ఎప్పుడు..?

AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు ఎప్పుడు..?

11 May 2024, 11:06 IST

google News
    • AP TET Results 2024 Updates : ఏపీ టెట్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఫలితాల విడుదలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 
ఏపీ టెట్ ఫలితాలు - 2024
ఏపీ టెట్ ఫలితాలు - 2024

ఏపీ టెట్ ఫలితాలు - 2024

AP TET Results 2024 : ఏపీ టెట్ ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు మార్చి 14వ తేదీనే రావాల్సి ఉంది. కానీ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. అయితే పెండింగ్ లో ఉన్న రిజల్ట్స్ త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

పోలింగ్ తర్వాత విడుదలకు ఛాన్స్…!

ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఫలితంగా ఫలితాల విడుదలపై ఈసీ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఫలితాల విడుదలకు విద్యాశాఖ మార్చి నెలలోనే ఈసీకి లేఖ రాసినప్పటికీ… ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. దీంతో ఫలితాల విడుదల ఆగిపోయింది. అంతేకాకుండా…. డీఎస్సీ పరీక్షల నిర్వహణకు కూడా అనుమతి రాలేదు. దీంతో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా పడాల్సి వచ్చింది.

టెట్ ఫైనల్ కీ విషయంలో కూడా సందిగ్ధత నెలకొంది. మార్చి 13వ తేదీనే వీటిని అందుబాటులోకి తీసుకువస్తామని విద్యాశాఖ చెప్పినప్పటికీ అందుబాటులోకి రాలేదు. కానీ మార్చి 14వ తేదీన తుది కీ లను విద్యాశాఖ వెబ్ సైట్ లో ఉంచింది. షెడ్యూల్ ప్రకారం… ఈ తేదీనే ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ తో ఆగిపోయింది.

మరోవైపు టెట్ ఫలితాల కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాలను బట్టి డీఎస్సీ సన్నద్ధతపై క్లారిటీకి రావొచ్చని భావిస్తున్నారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత…. టెట్ ఫలితాలపై అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. ఫలితాల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో రిజల్ట్స్ ప్రకటనకు మార్గం సుగమవుతుంది. అయితే డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయంలో మాత్రం ఇప్పుడే క్లారిటీ రాకపోవచ్చు.

Download AP TET Score Card 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  • డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ టెట్ స్కోర్ కీలకం కాబట్టి... స్కోరు కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు…

TS TET 2024 Hall Tickets : తెలంగాణ టెట్ పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం…. మే 20 నుంచే ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీతో పూర్తి అవుతాయి. 25,26,27 తేదీల్లో ఎలాంటి పరీక్షలు కూడా లేవు. మిగతా అన్ని తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జూన్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

TS TET Hall Tickets Download : తెలంగాణ టెట్ హాల్ టికెట్లు

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు మే 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంటే పరీక్షలు ప్రారంభమయ్యే ఐదు రోజుల ముందు నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది. https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు

  • టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే 'డౌన్లోడ్ Hall Tickets 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్ అవసరాల రీత్యా భద్రంగా ఉంచుకోవటం మంచిది.

తదుపరి వ్యాసం