TS TET 2024 Updates : అలర్ట్... మే 15 నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు, డౌన్లోడ్ లింక్ ఇదే-telangana tet hall tickets 2024 will be available from may 15 latest updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 Updates : అలర్ట్... మే 15 నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు, డౌన్లోడ్ లింక్ ఇదే

TS TET 2024 Updates : అలర్ట్... మే 15 నుంచి తెలంగాణ టెట్ హాల్ టికెట్లు, డౌన్లోడ్ లింక్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 09, 2024 05:34 PM IST

TS TET 2024 Hall Tickets Updates : తెలంగాణ టెట్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక మే 15వ తేదీ నుంచి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

తెలంగాణ టెట్ పరీక్షలు - 2024
తెలంగాణ టెట్ పరీక్షలు - 2024

TS TET 2024 Hall Tickets : తెలంగాణ టెట్ పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం…. మే 20 నుంచే ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

yearly horoscope entry point

తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీతో పూర్తి అవుతాయి. 25,26,27 తేదీల్లో ఎలాంటి పరీక్షలు కూడా లేవు. మిగతా అన్ని తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జూన్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.

TS TET Hall Tickets Download : తెలంగాణ టెట్ హాల్ టికెట్లు

ఇక తెలంగాణ టెట్ హాల్ టికెట్లు మే 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంటే పరీక్షలు ప్రారంభమయ్యే ఐదు రోజుల ముందు నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది. https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు

  • టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే 'డౌన్లోడ్ Hall Tickets 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్ అవసరాల రీత్యా భద్రంగా ఉంచుకోవటం మంచిది.

TS TET Schedule : తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ - 2024

  • మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S)
  • మే 21, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 21, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 22, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 22, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 28 , 2024– పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)
  • మే 28, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 29, 2024 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)
  • మే 29, 2024 – పేప‌ర్ 2- సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 30 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 30, 2024 – పేప‌ర్ 1- (సెష‌న్ – S2)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S2)
  • జూన్ 1 , 2024– పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • జూన్ 1, 2024 – పేప‌ర్ 1-(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – S2)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1- (సెష‌న్ – S2).

ఏప్రిల్ 27వ తేదీన ఖమ్మం - నల్గొండ- వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉంది. చాలా మంది అభ్యర్థులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈసీకి కూడా విజ్ఞప్తులు అందాయి. షెడ్యూల్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా… ఏప్రిల్ 27వ తేదీన పరీక్షలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది విద్యాశాఖ.

ఎన్ని దరఖాస్తులు అంటే..?

ఈసారి నిర్వహించబోయే టెట్ పరీక్ష(TS TET Exams 2024) కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 కోసం 99,210 మంచి నుంచి అప్లికేషన్లు రాగా… పేపర్‌-2(TET Paper 2)కు 1,84,231 మంది అప్లయ్ చేశారు. మరోవైపు తెలంగాణ టెట్(TET)కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకొవచ్చు.

Whats_app_banner