TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?-ts tet examination schedule 2024 released check key dates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
May 03, 2024 07:31 PM IST

TS TET Examination Schedule 2024: తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 20వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. జూన్ 2తో అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి.

తెలంగాణ టెట్ పరీక్షలు - 2024
తెలంగాణ టెట్ పరీక్షలు - 2024

TS TET Examination Schedule 2024 : తెలంగాణ టెట్(TS TET) పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు మే 20వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలు… జూన్ 2వ తేదీతోనే పూర్తి కానున్నాయి. ఏప్రిల్ 27వ తేదీను ఎలాంటి పరీక్షలు లేవు. ఇదే రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉంది.

టెట్ పరీక్షల షెడ్యూల్ - ఏ పరీక్ష ఎప్పుడంటే..?

TS TET Schedule : తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ - 2024

  • మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 20, 2024 – పేప‌ర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S)
  • మే 21, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 21, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 22, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
  • మే 22, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
  • మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 28 , 2024– పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)
  • మే 28, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 29, 2024 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)
  • మే 29, 2024 – పేప‌ర్ 2- సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
  • మే 30 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 30, 2024 – పేప‌ర్ 1- (సెష‌న్ – S2)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S2)
  • జూన్ 1 , 2024– పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
  • జూన్ 1, 2024 – పేప‌ర్ 1-(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – S2)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
  • జూన్ 2 , 2024– పేప‌ర్ 1- (సెష‌న్ – S2).

విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మే 20 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపింది. జూన్ 06వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తి అవుతాయని ప్రకటించింది. తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం… పరీక్షలన్నీ జూన్ 2వ తేదీతోనే పూర్తి అవుతున్నాయి. ఏప్రిల్ 27వ తేదీన మాత్రమే ఎలాంటి పరీక్షలు లేవు.

ఏప్రిల్ 27వ తేదీన ఖమ్మం - నల్గొండ- వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉంది. చాలా మంది అభ్యర్థులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈసీకి కూడా విజ్ఞప్తులు అందాయి. షెడ్యూల్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా… కేవలం ఏప్రిల్ 27వ తేదీని మినహాయించి… మిగతా తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది విద్యాశాఖ.

ఎంత మంది దరఖాస్తు చేశారంటే..?

ఈసారి నిర్వహించబోయే టెట్ పరీక్ష(TS TET Exams 2024) కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 కోసం 99,210 మంచి నుంచి అప్లికేషన్లు రాగా… పేపర్‌-2(TET Paper 2)కు 1,84,231 మంది అప్లయ్ చేశారు.

మరోవైపు తెలంగాణ టెట్(TET)కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకొవచ్చు.

Whats_app_banner