తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు బంద్

AP Liquor Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు బంద్

03 December 2024, 14:49 IST

google News
  • AP Liquor Shops Close : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా 48 గంటల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 5న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు దగ్గరగా ఉన్న వైన్ షాపులను డిసెంబర్ 3 సాయత్రం 4 గం. నుంచి 5వ తేదీ సాయంత్రం 4 వరకు మూసివేయనున్నారు.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఈ జిల్లాల్లో 48 గంటల పాటు వైన్ షాపులు బంద్

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 5న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం(డిసెంబర్ 5) సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలోని వైన్ షాపులను బంద్ చేయాలని ఆదేశించారు. టీచర్ ఎమెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మద్యం షాపుల్ని మూసివేయాలని ఆదేశించామని ఎన్నికల ఎన్నికల ప్రధానాధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డిసెంబర్ 5న పోలింగ్

డిసెంబర్ 5న ఉభయ గోదావరి జిల్లాలో జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి సోమవారం నాడు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఐదు జిల్లాల పరిధిలో 16,737 మంది ఓటర్లు ఉండగా 116 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలో 3418 మంది ఓటర్లు ఉండగా, 22 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 5వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులను కాకినాడ జేఎన్‌ టీయూలోని బీఆర్‌ అంబేడ్కర్ సెంట్రల్‌ లైబ్రరీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తారు.

మద్యం విక్రయాలకు కొత్త రూల్స్‌

ఏపీ మద్యం విక్రయాల్లో ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు విధిస్తూ ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ప్రైవేట్‌ మద్యం దుకాణాలు బెల్ట్ షాపులపై విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రైవేట్‌ మద్యం దుకాణదారులు ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తే మొదటి సారి రూ.5లక్షల జరిమానా విధిస్తారు. రెండో సారి అదే నేరానికి పాల్పడితే షాప్ లైసెన్స్‌ రద్దు చేస్తారు. లైసెన్స్‌ మంజూరు చేసిన దుకాణంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే మొదటి సారి నేరానికి రూ.5లక్షల జరిమానా విధిస్తారు. రెండోసారి పట్టుబడితే షాప్ లైసెన్స్‌ రద్దు చేస్తారు.

2018లో ఎక్సైజ్‌ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 12లో పేర్కొన్న జరిమానాలను ఎమ్మార్పీ నిబంధనల ఉల్లంఘన, బెల్టు షాపుల నిర్వహణ మినహా మిగిలిన అంశాల్లో కొనసాగనుంది. ఇవే నేరాలను బార్‌ లైసెన్స్‌ దారులు పాల్పడితే వారికి ఏపీ ఎక్సైజ్‌ యాక్ట్‌ 1968 అండర్‌ సెక్షన్ 47(1) ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో నూతన మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు దుకాణాలకు లైసెన్స్ జారీ చేశారు. అయితే అధికార నేతల అండతో…గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతున్నారు. తనిఖీల సమయంలో అధికారం అడ్డంపెట్టుకుని తప్పించుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.

తదుపరి వ్యాసం