తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet 2024: ముగుస్తున్న ఏపీ లాసెట్‌ 2024 దరఖాస్తు గడువు, లేట్‌ ఫీతో మరో రెండ్రోజులే గడువు

AP LAWCET 2024: ముగుస్తున్న ఏపీ లాసెట్‌ 2024 దరఖాస్తు గడువు, లేట్‌ ఫీతో మరో రెండ్రోజులే గడువు

Sarath chandra.B HT Telugu

27 May 2024, 7:47 IST

google News
    • AP LAWCET 2024: ఏపీ లాసెట్ 2024 దరఖాస్తుల గడువు ముగియనుంది. మూడు వేల రుపాయల ఆలశ్య రుసుముతో మే 26 నుంచి మే29వరకు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు అప్లికేషన్‌లో తప్పులను సరి చేయడానికి అవకాశం కల్పిస్తారు.
ఏపీ లాసెట్‌ 2024కు మరో రెండు రోజులే గడువు
ఏపీ లాసెట్‌ 2024కు మరో రెండు రోజులే గడువు

ఏపీ లాసెట్‌ 2024కు మరో రెండు రోజులే గడువు

AP LAWCET 2024: ఏపీ లాసెట్ 2024 దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. గత మార్చి 26 నుంచి లాసెట్‌ దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. మూడు వేల రుపాయల ఆలశ్య రుసుముతో మే 26 నుంచి మే29వరకు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండంటంతో దరఖాస్తు చేసుకోని వారు లాసెట్ 2024కు దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు అప్లికేషన్‌లో తప్పులను సరి చేయడానికి అవకాశం కల్పిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ (AP LAWCET 2024), పీజీ లాసెట్‌(AP PG LCET 2024) ఉమ్మడి నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీలతో పాటు రెండేళ్ల పీజీ లా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు లా సెట్ నిర్వహిస్తున్నారు. జూన్‌ 9,2024 లాసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఏడాది లాసెట్‌ ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University) నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ఏపీ లాసెట్‌ 2024, పీజీ లాసెట్‌ PG Lawcet 2024 ఉమ్మడి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీలతో పాటు రెండేళ్ల పీజీ లా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.

మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల కోసం లాసెట్‌ రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.800 చెల్లించాలి. పీజీ కోర్సులకు ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్ని ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

మార్చి 26 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్‌ 9న మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం నాలుగు వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

లాసెట్‌ 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 ఏప్రిల్ 25, 2024. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 మే 3 వరకు ఉంది. కరెక్షన్ విండో మే 30న ప్రారంభమై జూన్ 1, 2024న ముగుస్తుంది.

2024 జూన్ 3 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఏపీ లాసెట్ 2024 పరీక్షను 2024 జూన్ 9న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే విడతలో నిర్వహించనున్నారు.

ప్రొవిజనల్ ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేసి, అభ్యంతరాలపై విండోను జూన్ 11, 2024న ఓపెన్ చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు 2024 జూన్ 12 వరకు గడువు ఉంది.

జూన్ 9న లాసెట్ పరీక్ష

మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల కోసం రిజిస్ట్రేషన్(AP Lawcet Registration) ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.800 చెల్లించాలి. పీజీ కోర్సులకు ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ అభ్యర్థులు రూ.950, ఎస్సీ, ఎస్టీలు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజుల్ని ఆన్‌లైన్‌ పేమెంట్ల ద్వారా చెల్లించాలని నిర్వాహకులు తెలిపారు. లాసెట్, పీజీ లా సెట్‌ పరీక్షలు జూన్‌ 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.00 గంటల వరకు నిర్వహిస్తారు.

ఏపీ లాసెట్ ఎలా దరఖాస్తు చేయాలి?(How To Apply AP LAWCET 2024)

Step 1 : ఏపీ లాసెట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 : హోమ్ పేజీలో Eligibility, Fee Payment ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. ఫీజు చెల్లించాలి.

Step 3 : ఆ తర్వాత ఫీజు పేమంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.

Step 4 : ఫీజు పేమంట్ తర్వాత అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

Step 5 : అభ్యర్థి Print Application form ఆప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.

తదుపరి వ్యాసం