తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Private Universities Fee : ఏపీలోని ప్రైవేట్ వ‌ర్సిటీల్లో కోర్సుల ఫీజులు ఖ‌రారు, కొత్తగా ఐదు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి

AP Private Universities Fee : ఏపీలోని ప్రైవేట్ వ‌ర్సిటీల్లో కోర్సుల ఫీజులు ఖ‌రారు, కొత్తగా ఐదు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి

HT Telugu Desk HT Telugu

14 July 2024, 15:46 IST

google News
    • AP Private Universities Fee : ఏపీలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో గవర్నమెంట్ కోటా సీట్ల ఫీజులు ఖరారయ్యాయి. ఈ మేరుక ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలోని ప్రైవేట్ వ‌ర్సిటీల్లో కోర్సుల ఫీజులు ఖ‌రారు, కొత్తగా ఐదు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి
ఏపీలోని ప్రైవేట్ వ‌ర్సిటీల్లో కోర్సుల ఫీజులు ఖ‌రారు, కొత్తగా ఐదు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి

ఏపీలోని ప్రైవేట్ వ‌ర్సిటీల్లో కోర్సుల ఫీజులు ఖ‌రారు, కొత్తగా ఐదు ప్రైవేట్ కాలేజీలకు అనుమతి

AP Private Universities Fee : రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో గ‌వ‌ర్నమెంట్‌ కోటా సీట్ల ఫీజుల‌ను ప్రభుత్వం ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఫీజులు 2024-25 నుంచి 2026-27 వ‌ర‌కు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. ఆయా యూనివర్సిటీల్లో ఫీజులు ఇలా ఉన్నాయి.

మోహ‌న్‌బాబు యూనివర్సిటీ (రంగంపేట‌, తిరుప‌తి)లో కోర్సుల ఫీజులు

ఏడాదికి బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చర్ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.1,30,000గా ఖరారు చేసింది. బీబీఎ, బీసీఏ, బీఎస్సీ (బ‌యోఇన్‌ఫ‌ర్మటిక్‌), బీఎస్సీ (బ‌యో టెక్నాల‌జీ), బీఎస్సీ (కంప్యూట‌ర్ సైన్‌), బీఎస్సీ (మైక్రో బ‌యోల‌జీ) కోర్సుల‌కు ఫీజులు ఒక్కొదానికి రూ.44,500గా ఖ‌రారు చేశారు. బీఎస్సీ (ఫోరెన్సిక్ సైన్‌) కోర్సు ఫీజు రూ.37 వేలు కాగా, బీ.ఫార్మసీ, ఫార్మా డీ, పార్మా (పీబీ) కోర్టుల‌కు ఫీజులు ఒక్కొదానికి రూ.51,500గా నిర్ణయించారు. ఎం.ఫార్మసీ కోర్సు ఫీజు రూ.99,500 కాగా, బీకాం (కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌), బీఏ (ఫిల్మ్ మేకింగ్), బీఏ (డైరెక్షన్‌), బీఏ (సినిమాటోగ్రఫీ), బీఏ (ఫోటోగ్రఫీ), బీఏ (సౌండ్ ఇంజినీరింగ్‌), బీ.డీజైన్ (కాస్టూమ్స్ అండ్ ఫ్యాష‌న్ డిజైనింగ్‌) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.29,500గా నిర్ణయించారు. ఎంఎస్సీ (బ‌యో టెక్నాల‌జీ), ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ. 73,500గా నిర్ణయించారు.

గోదావ‌రి గ్లోబల్ యూనివర్సిటీ (రాజ‌మండ్రి)లో కోర్సుల‌ ఫీజులు

ఏడాదికి బీటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ. 60,000గా నిర్ణయించారు. ఎంటెక్ కోర్సు ఫీజు రూ.99,500 కాగా, బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చర్ కోర్సుకు ఫీజు రూ.44,500, బీసీఏ కోర్సుకు ఫీజు రూ.37 వేలు ఖ‌రారు చేశారు బీఎస్సీ, బీఎస్సీ (ఫోరెన్సిక్ సైన్స్‌), బీఎస్సీ (పెర్ఫ్యూజ‌న్ టెక్నాల‌జీ) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.35,500గా నిర్ణ‌యించారు.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (అమ‌రావ‌తి)లో కోర్సుల ఫీజులు

ఏడాదికి బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.1,02,000గా నిర్ణయించారు. బీబీఏ, బీఎస్సీ, బీకాం, బీఏ, ఎంఎస్సీ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.44,000గా ఖ‌రారు చేశారు.

అన్నమాచార్య యూనివర్సిటీ (రాజంపేట‌)లో కోర్సుల ఫీజులు

ఏడాదికి బీటెక్ కోర్సుకు రూ.60 వేలు, ఎంటెక్‌కు రూ.99,500గా నిర్ణయించారు. ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.60 వేలుగా ఖ‌రారు చేశారు. బీఎస్సీ ఆన‌ర్స్‌ అగ్రిక‌ల్చర్ కోర్సుకు ఫీజు రూ.44,500కాగా, ఎంఏ (ఇంగ్లీష్‌)కు ఫీజు రూ.29,500గా నిర్ణ‌యించారు. బీఎస్సీ (కంప్యూట‌ర్స్‌), బీఎస్సీ (ప్రొగ్రామింగ్ అండ్ డేటా సైన్స్‌), బీఎస్సీ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీ అండ్ మిష‌న్ లెర్నింగ్‌), బీఎస్సీ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెల్‌జెన్సీ అండ్ డేటా అనాల‌సిస్) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.35,500గా ఖ‌రారు చేశారు. ఎంఎస్సీ (అప్లయిడ్ మాథ్యమెటిక్స్‌), ఎంఎస్సీ (ఫిజిక్స్), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.44 వేలుగా నిర్ణ‌యించారు.

భార‌తీయ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఇన్నోవేష‌న్ యూనివర్సిటీ (అనంత‌పురం)లో కోర్సుల ఫీజులు

ఏడాదికి బీటెక్ ఫీజు రూ.69,500గా నిర్ణయించారు. బీసీఏ (ఫుల్ స్టాక్‌), బీసీఏ (ఫైన్ టెక్‌), బీబీఏ, బీబీఏ (ఫైన్‌టెక్‌), బీబీఏ (హాస్ప‌టిల్ మేనేజ్‌మెంట్‌) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.37 వేలుగా ఖ‌రారు చేశారు. బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చ‌ర్‌, ఎంఎస్సీ అగ్రిక‌ల్చర్ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.99 వేలుగా నిర్ణయించారు. బీఎల్‌, ఎల్ఎల్‌బీ (ఐదేళ్లు), బీఎస్సీ ఆన‌ర్స్ ఫారెస్ట్రీ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.59 వేలుగా పేర్కొన్నారు.

ఆదిత్య యూనివర్సిటీ (సురంపాలెం, తూర్పుగోదావ‌రి)లో కోర్సుల ఫీజులు

ఏడాదికి బీటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, ఐఎంబీఏ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.60 వేలుగా నిర్ణయించారు. ఎంటెక్ కోర్సుకు ఫీజు రూ.99,500గా ఖరారు చేశారు.

కేఆర్ఈఏ యూనివర్సిటీ (శ్రీ‌సీటీ, తిరుప‌తి)లో కోర్సుల ఫీజులు

ఏడాదికి ఎంబీఏ, బీఏ, బీఎస్సీ (నాలుగేళ్లు) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.97,500గా నిర్ణ‌యించారు. బీబీఏ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్) కోర్స‌కు ఫీజు రూ.37 వేలుగా ఖరారు చేశారు.

విట్ యూనివర్సిటీ (అమ‌రావ‌తి)లో కోర్సుల ఫీజులు

ఏడాదికి బీటెక్‌, ఎంటెక్‌, ఎంటెక్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.1,03,000గా నిర్ణయించారు. బీబీఏ, బీకాం (ఫైనాన్స్‌), బీఎస్సీ, ఎంఎస్సీ డేటా సైన్ (డ్యూయ‌ల్ డిగ్రీ), బీఏ, ఎంఏ ప‌బ్లిక్ స‌ర్వీస్ (డ్యూయ‌ల్ డిగ్రీ) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.44,500గా ఖ‌రారు చేశారు. బీఏ, ఎల్ఎల్‌బీ ఆన‌ర్స్ (ఐదేళ్లు), బీబీఏ, ఎల్ఎల్‌బీ ఆన‌ర్స్ (ఐదేళ్లు) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.59 వేలుగా నిర్ణ‌యించారు. ఎంఎస్సీ (డేటా సైన్స్‌), ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఎంఎస్సీ (ఫిజిక్స్) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.73,500గా ఖ‌రారు చేశారు.

ది అపోలో యూనివర్సిటీ (మురుకంబ‌ట్టు, చిత్తూరు)లో కోర్సుల ఫీజులు

ఏడాదికి బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ (హాస్పిట‌ల్ అండ్ హెల్త్ కేర్ మెనేజ్‌మెంట్‌) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.99,500గా ఖ‌రారు చేశారు. బీబీఏ, బీఎస్సీ (జెనిటిక్స్ అండ్ మోక్యూల‌ర్ బ‌యోల‌జీ), బీఎస్సీ (బ‌యో మెడిక‌ల్ సైన్స్‌), బీఎస్సీ (హెల్త్ సైకాల‌జీ) కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.42,500గా నిర్ణ‌యించారు. బీ ఫార్మ‌సీ కోర్సుకు ఫీజు రూ.49 వేలుగా పేర్కొన్నారు. ఎంఎస్సీ (క్లినిక‌ల్ సైకాల‌జీ), ఎంఎస్సీ (హెల్త్ ఇన్ఫర్మేష‌న్ అండ్ అనాలిటిక్స్‌), మాస్టర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ కోర్సుల ఫీజులు ఒక్కొదానికి రూ.71 వేలుగా ఖ‌రారు చేశారు.

సెంచూరియన్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ (విజ‌య‌న‌గ‌రం)లో కోర్సు ఫీజు

ఏడాకి బీటెక్ కోర్సు ఫీజు రూ.60 వేలుగా ఖ‌రారు చేశారు.

కొత్త క్యాంప‌స్‌ల‌కు అనుమ‌తులు

రాష్ట్రంలో కొత్తగా ఒక ఇంజినీరింగ్ కాలేజీ, నాలుగు కొత్త క్యాంప‌స్‌ల‌కు అనుమ‌తులు ప్రభుత్వం మంజూరు చేసింది. చిత్తూరు జిల్లాలో కొత్త కాలేజీ విజ‌యం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీకి అనుమ‌తులు మంజూరు చేసింది. ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ టెక్నాల‌జీ, అశోక మ‌హిళ ఇంజినీరింగ్ కాలేజీ, సైన్సెస్‌, సాంకేతిక విద్యాప‌రిష‌త్ ఇంజినీరింగ్ కాలేజీ, పీవీకేకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీల‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అలాగే రాష్ట్రంలోని 18 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవ‌త్సరానికి గాను బీటెక్ కోర్సుల ఫీజు రూ.40 వేలుగా నిర్ణయిస్తూ మ‌రో గెజిట్ విడుద‌ల చేసింది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం