Student Suicide : గీతం వర్శిటీలో విషాదం… ఐదో అంతస్తు నుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య-gitam university female student commits suicide by jumping from fifth floor in patancheru ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Student Suicide : గీతం వర్శిటీలో విషాదం… ఐదో అంతస్తు నుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Student Suicide : గీతం వర్శిటీలో విషాదం… ఐదో అంతస్తు నుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Sangareddy News: సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గీతం వర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. కొద్దిరోజుల కిందటే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థినిని… సూసైడ్ చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రేణు శ్రీ

Sangareddy District News: హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన రేణు శ్రీ… గీతం యూనివర్సిటీలో చేరింది. మూడు నెలల్లోనే ఆత్మహత్య చేసుకోవడం, క్యాంపస్ లో సంచలనం రేపింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఇంకా తెలియల్సివుంది. మాదాపూర్ లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు, విషయం తెలుసుకొని ఆసుపత్రికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు.

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పఠాన్ చెరువు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిల్డింగ్ మీద నుంచి దూకుతుండగా, అవతలివైపు వున్నా మరికొంతమంది విద్యార్థులు ఈ సంఘటనను మొత్తం తమ సెల్ ఫోన్ లో వీడియో తీశారు.

రిపోర్టింగ్ : మెదక్ జిల్లా ప్రతినిధి