తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Engineering Colleges Fee : ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు- అత్యధిక ఫీజులున్న కాలేజీల లిస్ట్ ఇదే

AP Engineering Colleges Fee : ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు- అత్యధిక ఫీజులున్న కాలేజీల లిస్ట్ ఇదే

08 July 2024, 18:38 IST

AP Engineering Colleges Fee : ఏపీ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు ఖరారు చేసింది. బీటెక్ తోపాటు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • AP Engineering Colleges Fee : ఏపీ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు ఖరారు చేసింది. బీటెక్ తోపాటు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు ఖరారు చేసింది. బీటెక్ తోపాటు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 
(1 / 6)

ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి అత్యధికంగా రూ. 1.03 లక్షల నుంచి రూ. 1.05 లక్షల వరకు ఫీజులు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అత్యల్పంగా రూ. 40 వేలు నిర్ణయించింది.  రాష్ట్రంలోని మొత్తం 210 బీటెక్‌ కాలేజీలతో పాటు, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజులను నిర్ణయించింది. 
(2 / 6)

రాష్ట్రంలోని మొత్తం బీటెక్ కాలేజీల్లో రూ. 1 లక్షకు పైగా ఫీజులు వసూలు చేసే కాలేజీలు 8 కాలేజీలు ఉండగా, రూ. 40 వేల ఫీజులు వసూలు కాలేజీలు 114 ఉన్నాయి.  రెండు ఆర్కిటెక్చర్‌ కాలేజీలకు రూ.35 వేల ఫీజును ఖరారు చేసింది. 
(3 / 6)

ఇంజినీరింగ్ ట్యూషన్‌ ఫీజుతో పాటు ఐడెంటిటీ కార్డు, వైద్య ఖర్చులు, స్పోర్ట్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌ ఖర్చులన్నీ వీటిలోకే వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ట్రావెల్, హాస్టల్‌, మెస్‌, రిజిస్ట్రేషన్‌, రిఫండబుల్ ఫీజులు మాత్రం వీటిలోకి రావని స్పష్టం చేసింది.  వీటిని కాలేజీ యాజమాన్యాలు నిర్ణయిస్తాయని తెలిపింది. 
(4 / 6)

కాలేజీలు నిర్ణయించిన ఫీజులకు అదనంగా డొనేషన్లు, క్యాపిటేషన్ పేరుతో ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది.  అదనంగా ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
(5 / 6)

ఏపీ హైకోర్టులో ఫీజులపై రిట్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. కోర్టు తీర్పునకు లోబడి ఫీజులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో అత్యధిక ఫీజులు నిర్ణయించిన కాలేజీల్లో గుంటూరుకు చెందిన ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యా పరిషత్‌ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్‌ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్‌ సిద్దార్థ,  భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజి ఫర్‌ ఉమెన్‌...  ఉన్నాయి. వీటికి రూ.1.05 లక్షల ఫీజులు నిర్ణయించారు. భీమవరం విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి రూ.1.03 లక్షలు,  విశాఖ జీవీపీ కాలేజీ ఫర్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురం ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీకి ఫీజు రూ.93,700గా నిర్ణయించారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి