తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Weather News : రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి వర్షాలు - కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్!

AP TG Weather News : రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి వర్షాలు - కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్!

12 September 2024, 21:08 IST

google News
    • ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ తేలికపాటి వర్ష సూచన ఇచ్చింది. మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీలో తేలికపాటి వర్షాలు
ఏపీలో తేలికపాటి వర్షాలు (image source unsplash.com)

ఏపీలో తేలికపాటి వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. మరో నాలుగైదు రోజులు పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వెల్లడించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐఎండీ సూచనల ప్రకారం… ఏపీలో రేపు(సెప్టెంబర్ 13) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. 30- 40 కి.మీ వేగంతో ఈ గాలులు ఉంటాయని పేర్కొంది.

ఇక తెలంగాణలో చూస్తే సెప్టెంబర్ 18వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వెదర్ బులెటిన్ లో వివరించింది.

వచ్చే వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది వాయుగుండంగా బలపడి ఏపీవైపు కదిలేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రభావంతో ఏపీలో మరోసారి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనా ఉన్నాయి. సెప్టెంబరు చివరి వారంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

 

తదుపరి వ్యాసం