తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather News : 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు..! తాజా వెదర్ అప్డేట్స్ వివరాలివే
- AP TG Weather Report : తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు తేలికపాటు వర్షాలే ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. ఏపీలో కొన్నిచోట్ల ఉపరితల గాలులు వీస్తాయని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి...
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
ఏపీ, తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. భారీ వర్షాలు కాకుండా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.(Image Source Unsplash.com)
(2 / 6)
ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. పలుచోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అంచనా వేసింది.(Image Source @APSDMA X)
(3 / 6)
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. ఏపీకి ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.(Image Source @APSDMA X)
(4 / 6)
ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(Image Source @APSDMA X)
(5 / 6)
తెలంగాణలో చూస్తే వారం రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే కురుసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. (Image Source @APSDMA X)
ఇతర గ్యాలరీలు