తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Hall Tickets : నేటి నుంచి ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు జారీ, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

AP Inter Hall Tickets : నేటి నుంచి ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు జారీ, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

21 February 2024, 19:47 IST

google News
    • AP Inter Hall Tickets : ఏపీ ఇంటర్ పరీక్షలకు నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు
ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు

ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు

AP Inter Hall Tickets : నేటి ఇంటర్ హాల్ టికెట్లు(AP Inter Hall Tickets) విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఏపీలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1559 సెంటర్లను సిద్ధం చేసింది. పరీక్ష గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు హాజరును ఆన్ లైన్ లో నమోదుచేసేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. గత ఏడాది పరీక్ష పేపర్ల లీక్ (Paper Leak)వివాదంతో ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్ష పేపర్లకు క్యూఆర్‌ కోడ్‌ను జతచేసింది. దీంతో ప్రశ్నాపత్రాన్ని ఎక్కడైనా ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా వెంటనే తెలిసే విధంగా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను నిషేధించారు. ఈ ఏడాది 10,52,221 మంది ఇంటర్ పరీక్షలకు(AP Inter Exams) ఫీజు చెల్లించారు. వీరిలో 4,73,058 మంది ఫస్టియర్, 5,79,163 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్ పరీక్ష పేపర్లను స్థానిక పోలీస్ స్టేషన్ లో భద్రపరచనున్నారు.

ముగిసిన ప్రాక్టికల్ పరీక్షలు

ఇంటర్ పేపర్లు భద్రపరిచే పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి ఇంటర్ బోర్డు ప్రత్యేకమైన ఫోన్ అందిస్తుంది. ఇది కేవలం ఇంటర్ బోర్డు అధికారుల మెసేజ్ చూసేందుకు పనిచేస్తుంది. ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుందని అధికారులు తెలిపారు. నిన్నటితో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. దీంతో నేటి నుంచి హాల్ టికెట్ల జారీకి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఏపీ ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎలా?

Step 1 : ముందుగా విద్యార్థులు ఇంటర్ అధికారిక వెబ్‌సైట్‌ bieap.apcfss.in ఓపెన్ చేయండి

Step 2 : హోమ్‌పేజీలో ఏపీ ఇంటర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: విద్యార్థుల లాగిన్ వివరాలు సమర్పించండి.

Step 4 : ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్-2024 స్క్రీన్‌ పై కనిపిస్తుంది.

Step 5 : మీ హాల్ టికెట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తేదీలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు)

  • మార్చి 1 - PART-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
  • మార్చి 4- PART-I ఇంగ్లీష్ పేపర్ -I
  • మార్చి 6 -మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్ - 1 , సివిక్స్ పేపర్ - 1
  • మార్చి 9 - మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ - 1, హిస్టరీ పేపర్ - 1
  • మార్చి 12- ఫిజిక్స్ పేపర్ - 1, ఎకనామిక్స్ - 1
  • మార్చి 14 - కెమిస్ట్రీ పేపర్ - I, కామర్స్ పేపర్ - 1, సోషియాలజీ పేపర్ - 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ -1
  • మార్చి 16 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - I, లాజిక్ పేపర్ -1 , బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - 1
  • మార్చి 19- మెడ్రన్ లాంగ్వేజ్ పేపర్- I, జాగ్రఫీ పేపర్- 1

ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలు(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు)

  • మార్చి 2- PART-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
  • మార్చి 5 -PART-I ఇంగ్లీష్ పేపర్-II
  • మార్చి 7- మ్యాథమెటిక్స్ పేపర్ పేపర్ - IIA, బోటనీ పేపర్ -II, సివిక్స్ పేపర్- II
  • మార్చి 11 - మ్యాథమెటిక్స్ పేపర్ - IIB, జువాలజీ పేపర్ పేపర్ -II, హిస్టరీ - II
  • మార్చి 13 - ఫిజిక్స్ పేపర్- II, ఎకనామిక్స్ - II
  • మార్చి 15 - కెమిస్ట్రీ పేపర్ - II, కామర్స్ పేపర్ - II, సోషియాలజీ పేపర్- II, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ -II
  • మార్చి 18 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - II, లాజిక్ పేపర్ -II , బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - II
  • మార్చి 20 - మెడ్రన్ లాంగ్వేజ్ పేపర్- II, జాగ్రఫీ పేపర్-II

తదుపరి వ్యాసం